English   

సొగ‌సు చూడ త‌ర‌మా..?

shriya-gayatri

ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 17 ఏళ్లవుతోంది. ఆమెతో వ‌చ్చిన కొంద‌రు ముద్దుగుమ్మ‌ల‌కు పెళ్లిళ్లు అయిపోయాయి.. ఇంకొంద‌రు ఆంటీ పాత్ర‌ల‌కు ఫిక్సైపోయారు. మ‌రికొంద‌రైతే ఏకంగా సినిమాలు మానేసారు.. కానీ ఇప్ప‌టికీ శ్రీ‌య మాత్రం ఇండ‌స్ట్రీలో స‌ర్వై అవుతూనే ఉంది. ఏ మాయ చేస్తుందో తెలియ‌దు గానీ 17 ఏళ్లుగా అదే ఫిజిక్ మెయింటేన్ చేస్తూ అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది ఈ 35 ఏళ్ల బ్యూటీ. తెలుగు ఇండ‌స్ట్రీకి 2001లో వ‌చ్చిన శ్రీ‌య‌.. హిందీలో ఓ ఏడాది ముందుగానే అడుగుపెట్టింది. టాలీవుడ్ టాప్ హీరోస్ అంద‌రితోనూ ఆడిపాడిన శ్రీ‌య‌.. ఇప్పటికీ అవ‌కాశాల వేట‌లో ముందే ఉంది. ఏడాదికి క‌నీసం రెండు సినిమాలు చేస్తోంది శ్రీ‌య‌. ఇప్పుడు కూడా త‌మిళ్ లో కార్తిక్ న‌రేన్ తెర‌కెక్కిస్తోన్న న‌ర‌గాసుర‌న్ లో న‌టిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ చిత్రంతో పాటు మ‌రో రెండు మూడు సినిమాల‌కు క‌మిటైంది శ్రీ‌య‌. మోహ‌న్ బాబు, విష్ణు గాయ‌త్రి సినిమాలోనూ హీరోయిన్ గా న‌టిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఇప్పుడు ఈ భామ ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. 

తెలుగులో సీనియ‌ర్ హీరోల‌కు శ్రీ‌య బెస్ట్ ఆప్ష‌న్ గా మారిపోయింది. ఆ మ‌ధ్య గోపాలా గోపాలాలో వెంక‌టేశ్ కు భార్య‌గా న‌టించిన శ్రీ‌య‌.. ఈ మ‌ధ్యే బాల‌య్యతో గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి, పైసావ‌సూల్ లో న‌టించింది. ఇక హిందీలోనూ ఉల‌వ‌చారు బిర్యానీ రీమేక్ త‌డ్కాలో న‌టిస్తోంది. సినిమాకు క‌నీసం 35 ల‌క్ష‌ల వ‌ర‌కు ఛార్జ్ చేస్తోంది ఈ భామ‌. దీనికి తోడు ఫ్యాష‌న్ వీక్స్, ఈవెంట్స్, డాన్సులు అంటూ ఏడాదికి క‌నీసం 3 కోట్ల వ‌ర‌కు వెన‌కేస్తోంది శ్రీ‌య‌. పైగా ఇప్ప‌టికీ అదిరిపోయే ఫిజిక్ తో హాట్ ఫోటోషూట్ల‌తో మ‌తులు పోగొట్టేస్తోంది ఈ భామ‌. ఈ మ‌ధ్యే బీచ్ లో అదిరిపోయే బికినీ షో చేసింది. ఐదేళ్లు ప‌ర్ ఫెక్ట్ ఫిజిక్ మెయింటేన్ చేయ‌డానికే నానా తిప్ప‌లు ప‌డుతున్న ఈ రోజుల్లో.. ఏకంగా 17 ఏళ్లు ఒకేలా క‌నిపించ‌డం అంటే చిన్న విష‌యం కాదు. ఆ సీక్రేట్ ఏంటో మిగిలిన హీరోయిన్ల‌కు కూడా చెబితే కాస్త హెల్ప్ అవుతుంది క‌దా శ్రీ‌యా..?

More Related Stories