English   

మోదీని టార్గెట్ చేసిన త‌మిళ హీరోలు..

Simbu-s-New-Song-On-Demonetisation-Sparkles-Controversy

ఏమైందో ఏమో కానీ ఇప్పుడు త‌మిళ హీరోల‌కు మోదీ టార్గెట్ గా మారాడు. మొన్న‌టి వ‌ర‌కు విజ‌య్ మెర్స‌ల్ తో తిప్ప‌లు పెడితే.. ఇప్పుడు శింబు ఆ లిస్ట్ లో జాయిన్ అయ్యాడు. ఒక్క పాట‌.. ఒకే ఒక్క‌పాట‌.. ఇప్పుడు శింబు మెడ‌కు చుట్టుకుంది. ఎవ‌రో రాసిన పాట‌కు తాను స్వ‌ర‌మిచ్చాడు ఈ హీరో. అది డీమానిటైజేష‌న్ పై సాగే పాట‌. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే మోదీ అండ్ బిజేపీ గ‌వ‌ర్న‌మెంట్ ను ఉతికి ఆరేసే పాట‌. దాంతో సాధార‌ణంగానే శింబుకు ఇప్పుడు దూ..... తీరిపోతుంది. పాడేవాడు ల‌వ్ ఆంథ‌మ్ లా మంచి పాట పాడ‌క‌.. ఈ సారి కాస్త కొత్త‌గా ట్రై చేసాడు. దాంతో ఏసేస్తామంటూ శింబుకు బెదిరింపులు కూడా వ‌స్తున్నాయి. దాంతో చెన్నైలోని ఈయ‌న ఇంటికి పోలీస్ భ‌ద్రత కూడా పెట్టారు.

ఈ పాట‌లో డీమానిటేష‌న్.. దానివ‌ల్ల ప్ర‌జ‌లు ప‌డిన ఇబ్బందులు.. జిఎస్టీ.. ఇలా ఇవ‌న్నీ నో క్యాష్ నో క్యాష్ పాట‌లో ఉన్నాయి. క‌పిల‌న్ రాసిన ఈ పాటకు శింబు స్వ‌రాన్ని అరువిచ్చాడంతే.త‌మ ప్ర‌భుత్వానికే వ్య‌తిరేకంగా పాట పాడ‌తావా అంటూ శింబును టార్గెట్ చేస్తున్నారు బిజేపీ. శింబు ఇలా ప్రైవేట్ ఆల్బ‌మ్స్ తో వివాదాల్లో ఇరుక్కోవ‌డం ఇదే తొలిసారి కాదు. రెండేళ్ల కింద ఈయ‌న రాసి పాడిన బీప్ సాంగ్ మామూలు ర‌చ్చ చేయ‌లేదు. ఈ పాట‌లో ఏకంగా మ‌హిళ‌ల‌నే టార్గెట్ చేసాడు శింబు. అంతే.. వాళ్ల‌కు ఎక్క‌డ లేని కోపం వ‌చ్చేసింది. అప్పుడు గానీ వాళ్ల‌కు దొరుకుంటే ఈ పాటికి శింబు పెళ్లైపోయుండేది. అప్పుడు తానొక్క‌డే ఇరుక్కుంటే ఏం బాగుంటుంద‌నుకున్నాడో ఏమో గానీ.. అనిరుధ్ ను కూడా ఇరికించేసాడు. ఆ పాట‌కి ట్యూన్స్ ఇచ్చింది త‌నే కాబ‌ట్టి. మొత్తానికి దారిన పోయే కంప‌ను తీసుకొచ్చి.. త‌ల‌పై పెట్టుకోవ‌డం అంటే ఇదే మ‌రి. త‌న పాటికి తానేదో హాయిగా సినిమాలు చేసుకోక‌.. ఇలా వివాదాల పాట‌లు నీకేలా శింబు..?

More Related Stories