English   

సిమ్రాన్ అలా చేస్తుందా..?

Simran-villain

సిమ్రాన్.. ఈ పేరుకు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఈమె గురించి తెలియ‌ని సౌత్ ప్రేక్ష‌కులు ఉండ‌రు. ఈ త‌రంకు కొత్తేమో కానీ ఒక్క త‌రం వెన‌క్కి వెళ్తే మాత్రం సిమ్రాన్ సోకుల‌కు ఇండ‌స్ట్రీ షేక్ అయిపోయింది ఒక‌ప్పుడు. స్టార్ హీరోలెవరైనా సిమ్రాన్ ఉండాల్సిందే. మిలీనియం మొద‌ట్లో ఈమె హ‌వా అలా న‌డిచింది మ‌రి. టాప్ హీరోల‌తో పాటు అప్ప‌టి కుర్ర హీరోలు మ‌హేశ్, ప్ర‌భాస్ లాంటి వాళ్ల‌తోనూ చిందేసింది సిమ్రాన్. ఇక ఇప్పుడు ఈమె సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొద‌లు పెట్టేసింది. అడ‌పాద‌డ‌పా చిన్న పాత్ర‌లు చేస్తూ వ‌స్తోన్న ఈ ముద్దుగుమ్మ‌.. ఇప్పుడు ఏకంగా విల‌న్ గా న‌టించ బోతుంది. శివకార్తికేయన్ హీరోగా న‌టిస్తోన్న సినిమాలో సిమ్రాన్ విల‌న్ గా న‌టించ‌బోతుంది. ఇందులో ఆమె పాత్ర చాలా భిన్నంగా ఉంటుంద‌ని సిమ్రాన్ చెబుతుంది. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం క‌చ్చితంగా త‌న కెరీర్ ను క‌చ్చితంగా కొత్త మ‌లుపు తిప్పడం ఖాయ‌మంటుంది సిమ్రాన్. 

తొండ ముదిరి ఊస‌ర‌వెల్లి అయిన‌ట్లుగా.. ఇప్పుడు ముదురు హీరోలంతా విల‌న్లుగా మారిపోతున్నారు. ఇప్పుడు మీకు మేమేం తీసిపోం అన్న‌ట్లు నిన్న‌టి త‌రం హీరోయిన్లు సైతం విలన్లుగా మారిపోతున్నారు. ఆ మ‌ధ్య జ‌య జాన‌కీ నాయ‌కా సినిమాలో వాణి విశ్వ‌నాథ్ కూడా విల‌న్ గానే న‌టించింది.  ఈ లిస్ట్ లోకి ఇప్పుడు సిమ్రాన్ కూడా చేరిపోయింది. ఈ మ‌ధ్యే విశాల్ న‌టించిన తుప్పరివాల‌న్ సినిమాలో కాసేపు క‌నిపించే అతిథిగా మెరిసింది సిమ్రాన్. విక్రమ్ హీరోగా తెర‌కెక్కుతోన్న ధ్రువ నక్ష‌త్రంలోనూ సిమ్రన్‌ కీలక పాత్రలో న‌టిస్తుంది. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ తో ఈమె గతంలో ప‌నిచేసారు. ఈ కాంబినేష‌న్ లో సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్ వ‌చ్చింది. ఇప్పుడు మ‌రోసారి సిమ్రాన్ ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తుంది. మ‌రి ఒక‌ప్పుడు త‌న అందాల‌తో మ‌రిపించిన సిమ్రాన్.. విల‌న్ గా ఎలా మెప్పిస్తుందో చూడాలి..!

More Related Stories