English   

శివ‌కార్తికేయ‌న్ కు రుణ‌ప‌డిన మ‌హేశ్.. 

Sivakarthikeyan-Ku-Runapadina-Mahesh

స్పైడ‌ర్ సినిమాపై తెలుగులో భారీ అంచ‌నాలున్నాయి. కానీ త‌మిళ‌నాట మాత్రం ఈ సినిమాపై ఎన్ని అంచ‌నాలున్నాయో చెప్ప‌డం క‌ష్టం. ఎందుకంటే అక్క‌డ మ‌హేశ్ ను ఎంత‌వ‌ర‌కు రిసీవ్ చేసుకుంటార‌నేది ఇంకా తెలియ‌లేదు. కానీ మురుగ‌దాస్ ఎఫెక్ట్.. మ‌హేశ్ కు ఉన్న స్టార్ డ‌మ్ క‌చ్చితంగా స్పైడ‌ర్ త‌మిళ వ‌సూళ్ల‌పై ప్ర‌భావం చూపిస్తుంద‌ని న‌మ్ముతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అయితే ఎంత ఎఫెక్ట్ ఉన్నా కూడా అక్క‌డి స్టార్ హీరోలు బ‌రిలో దిగితే మ‌హేశ్ కు తిప్ప‌లు త‌ప్ప‌వు. ఇన్నాళ్లూ ఇదే టెన్ష‌న్ ఉండేది కూడా. శివ‌కార్తికేయ‌న్ కూడా సెప్టెంబ‌ర్ 27న వెలైకార‌న్ సినిమాతో రావాల‌నుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు హీరోగా ప‌రాజ‌యం లేదు ఈయ‌న‌కు. అలాంటి హీరో మ‌హేశ్ తో పోటీ అంటే క‌చ్చితంగా స్పైడ‌ర్ కు తిప్ప‌లు త‌ప్ప‌వనే అనుకున్నారంతా. కానీ ఇప్పుడు స‌డ‌న్ గా రేస్ నుంచి త‌ప్పుకున్నాడు శివ‌. ఈయ‌న‌తో పాటు మ‌రో సినిమా కూడా అక్టోబ‌ర్ కు వెళ్లిపోయింది. దాంతో సెప్టెంబ‌ర్ 27న సోలోగా రానున్నాడు స్పైడ‌ర్. కానీ తెలుగులో మాత్రం ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ‌తో పాటు శ‌ర్వానంద్ మ‌హానుభావుడు సినిమాతో పోటీ ప‌డుతున్నాడు స్పైడ‌ర్. మ‌రి చూడాలిక‌.. మ‌హేశ్ ఏం చేస్తాడో..?

More Related Stories