English   

మ‌హేశ్ త‌ల‌పై మోయ‌లేని భారం.. 

Spyder-International-Rights-Sold-For-Whooping-Price

ఓవ‌ర్సీస్ లో మ‌న సినిమాలు 2 మిలియ‌న్ దాటితేనే పండ‌గ చేసుకుంటారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అదే ఓ అద్భుతంగా ఫీల్ అవుతుంటారు. అస‌లు తెలుగులో 2 మిలియ‌న్ దాటిన సినిమాలే ఆరు. బాహుబ‌లిని ప‌క్క‌న‌బెడితే.. శ్రీ‌మంతుడు.. అ..ఆ.. ఖైదీ నెం.150.. నాన్న‌కు ప్రేమ‌తో.. ఫిదా.. ఇవి మాత్ర‌మే 2 మిలియ‌న్ దాటాయి. అయితే ఇప్పుడు స్పైడ‌ర్ మాత్రం ఓ సంచ‌ల‌నాకి సిద్ధ‌మైంది. ఈ చిత్రాన్ని ఓవ‌ర్సీస్ లో అక్ష‌రాలా 23 కోట్ల‌కు అమ్మారు. అంటే క‌నీసం 25 కోట్ల షేర్ రాక‌పోతే సినిమా ఫ్లాపే. అక్క‌డ 23 కోట్లు రావ‌లంటే క‌నీసం 5 మిలియ‌న్ డాల‌ర్స్ వ‌సూలు చేయాలి. అంటే మ‌న లెక్క‌ల్లో అది 30 కోట్లపైనే. అంత గ్రాస్ వ‌స్తే కానీ 23 కోట్ల షేర్ రాదు. ఓవ‌ర్సీస్ లో 23 కోట్లంటే చిన్న విషయం కాదు.. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన సినిమాల్లో బాహుబ‌లి కాకుండా ఒక్క శ్రీ‌మంతుడు మాత్ర‌మే 20 కోట్ల గ్రాస్ అందుకుంది. అంటే షేర్ 13 కోట్లే ఉంటుంది. ఈ లెక్క‌న ఇప్పుడు స్పైడ‌ర్ సినిమాను అమ్మ‌డ‌మే 23 కోట్ల‌కు అమ్మేసారు. అంటే షేర్ క‌నీసం 25 కోట్లు రాక‌పోతే అక్క‌డ కొన్న బ‌య్య‌ర్ల‌కు న‌ష్టాలు త‌ప్ప‌వు. అయితే ఈ చిత్రానికి తెలుగుతో పాటు త‌మిళ మార్కెట్ కూడా ఉండ‌టం అద‌నం. మ‌రి చూడాలిక‌.. ఒక‌వేళ స్పైడ‌ర్ గానీ ఈ విచిత్రం చేస్తే మ‌హేశ్ ఓ అద్భుతానికి ముహూర్తం పెట్టిన‌ట్లే..!

More Related Stories