English   

శీనువైట్ల మ‌న‌సు మార్చుకున్నాడా..?

Srinu-Vaitla-To-Direct-A-Web-Series

దారుల‌న్నీ ఉండి.. మూసుకుపోయి.. ఎటూ క‌ద‌ల్లేని ప‌రిస్థితుల్లో ఉన్న‌పుడు మ‌న‌కు అనిపించేది అష్ట‌దిగ్భందనం. ఇప్పుడు శీనువైట్ల ప‌రిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ ద‌ర్శ‌కుడు ఇప్పుడు ఎటూ క‌ద‌ల్లేని కాదు.. క‌నీసం ఎటూ చూడ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్నాడు. అస‌లు మూడేళ్ల కింది వ‌ర‌కు ఎలా ఉన్నాడు.. ఇప్పుడు ఎలా అయిపోయాడు.. అంటూ శీనువైట్ల‌ను చూసి బాధ ప‌డుతున్నారు. వ‌ర‌స‌గా మూడు డిజాస్ట‌ర్లు ఇచ్చేస‌రికి శీనువైట్ల‌ను న‌మ్మే ప‌రిస్థితుల్లో ఏ హీరో లేడిప్పుడు. పైగా ఆగ‌డు.. బ్రూస్ లీ.. మిస్ట‌ర్ మూడు భారీ న‌ష్టాల‌నే తీసుకొచ్చాయి. ఇప్పుడు స్టార్ హీరోలే కాదు.. చిన్న హీరోలు కూడా శీనువైట్ల అంటే ఆలోచిస్తున్నారు. ఇన్నాళ్లూ ఏదో చేస్తాడులే.. మిస్ట‌ర్ తో బౌన్స్ బ్యాక్ అవుతాడులే అనుకున్నారంతా. కానీ ఈ సినిమా చూసిన త‌ర్వాత వైట్ల గారి బుర్ర‌పైనే డౌట్లు వ‌స్తున్నాయి. ఇలాంటి టైమ్ లో త‌న పాత స్నేహితుడు ర‌వితేజ‌ను ఆశ్ర‌యిస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు.

ఓ క‌థ సిద్ధం చేసి.. మాస్ రాజాను ఒప్పించాడ‌ని ఈ మ‌ధ్య వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు శీనువైట్ల‌ను న‌మ్మి కోట్లు పెట్టే నిర్మాత‌లు చాలా అరుదు. అందుకే త‌నతో పాటు ర‌వితేజ కూడా రెమ్యున‌రేష‌న్ లేకుండానే మైత్రి మూవీ మేక‌ర్స్ కు ఈ చిత్రం చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. అలా అయితే గానీ మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రం నిర్మించ‌మ‌ని తెగేసి చెప్పార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ర‌వితేజ కూడా ఈ క‌థ‌పై మ‌ళ్లీ ఆలోచ‌న‌లో ప‌డ్డాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. దానికితోడు మైత్రి మూవీ మేక‌ర్స్ కూడా వెన‌క‌డుగు వేస్తున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అందుకే డిసెంబ‌ర్ నుంచి అనుకున్న సినిమా కాస్తా ఇంకా ఆల‌స్యం అయ్యేలా క‌నిపిస్తుంది.

అందుకే ప్ర‌స్తుతం సినిమాల గురించి ఆలోచించ‌డం ప‌క్క‌న‌బెట్టి ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడు శీనువైట్ల‌. ఎలాగూ కామెడీపై మంచి ప‌ట్టున్న ద‌ర్శ‌కుడు కావ‌డంతో భారీ క్యాస్టింగ్ తో ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేయాల‌ని చూస్తున్నాడు వైట్ల‌. ఎలాగూ ఇప్పుడు వెబ్ సిరీస్ ల‌కు మంచి డిమాండ్ ఉంది. దాంతో వైట్ల కూడా అటువైపు నుంచి న‌రుక్కురావ‌డానికి చూస్తున్నాడు. వీలైనంత లో బ‌డ్జెట్ లో ఈ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడు శీనువైట్ల‌. ఆ త‌ర్వాత సినిమాపై దృష్టి పెట్ట‌నున్నాడు. అది గానీ హిట్టైతే సినిమా అవ‌కాశాల‌పై కూడా ప్ర‌భావం చూపించే అవ‌కాశం లేక‌పోలేదు. మొత్తానికి ఎక్క‌డో ఉన్న కెరీర్.. మూడు ఫ్లాపుల‌తో ఎక్క‌డికో వ‌చ్చి ప‌డింది.

More Related Stories