English   

డిసెంబ‌ర్ నుంచి శీనువైట్ల సినిమా.. 

Srinu-Vaitla-s-Next-Launch-Date-Fixed

మిస్ట‌ర్ ఫ్లాప్ తో క‌నిపించ‌డ‌మే మానేసాడు శీనువైట్ల‌. అస‌లు ఈ ద‌ర్శ‌కుడు ఒక‌రు ఉన్నార‌నే సంగ‌తి కూడా ఇండ‌స్ట్రీ మ‌రిచిపోయింది. హిట్ల‌లో ఉన్న‌పుడే ద‌ర్శ‌కుడికి విలువ‌. కానీ ఏం చేస్తాం.. శీనువైట్ల మూడు డిజాస్ట‌ర్లు ఇచ్చాడు. దాంతో మ‌నోడి వైపు ఏ హీరో క‌నీసం చూడ‌ట్లేదు కూడా ఇప్పుడు. అందుకే మ‌ళ్లీ మొద‌ట్నుంచీ మొద‌లుపెడుతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఒక‌ప్పుడు తాను లైఫ్ ఇచ్చిన ర‌వితేజ‌నే ఇప్పుడు త‌న లైఫ్ కోసం వాడుకోవాల‌ని చూస్తున్నాడు. అత‌డి ద‌గ్గరికే వెళ్తున్నాడు శీనువైట్ల‌. ఇప్ప‌టికే ఈయ‌న చెప్పిన లైన్ ర‌వితేజ‌కు న‌చ్చింద‌ని తెలుస్తోంది. శీనువైట్ల‌తో సినిమా చేయ‌డానికి ర‌వితేజ కూడా ఓకే అనేసాడు.

ఇక్క‌డ చిన్న మెలిక కూడా ఉంది. ఇప్పుడు శీనువైట్ల‌ను న‌మ్మి కోట్లు పెట్టే నిర్మాత‌లు చాలా అరుదు. అందుకే త‌నతో పాటు ర‌వితేజ కూడా రెమ్యున‌రేష‌న్ లేకుండానే ఈ చిత్రం చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. అలా అయితే గానీ మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రం నిర్మించ‌మ‌ని తెగేసి చెప్పార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అందుకే సినిమాను చాలా త‌క్కువ బ‌డ్జెట్ లో పూర్తి చేసి.. విడుద‌లైన త‌ర్వాత లాభాల్లో షేర్ తీసుకోవాల‌ని చూస్తున్నారు శీనువైట్ల‌.. ర‌వితేజ‌. డిసెంబ‌ర్ నుంచి ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌బోతుంద‌ని తెలుస్తోంది. ఆ లోపు తాను క‌మిటైన ట‌చ్ చేసి చూడు.. రాజా ది గ్రేట్ సినిమాల‌ను పూర్తి చేయ‌నున్నాడు ర‌వితేజ‌. మొత్తానికి ఒక‌ప్పుడు సినిమాకు 10 కోట్లకు పైగా తీసుకున్న శీనువైట్ల‌.. ఇప్పుడు ఫ్రీగా చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అదే మ‌రి విధి వైప‌రిత్యం అంటే..! మ‌రి ఈ సినిమాతోనైనా శీనువైట్ల ఈజ్ బ్యాక్ అనిపించుకుంటాడో లేదో..?

More Related Stories