English   

ఆర్ఎఫ్ సీలో స్టార్స్ గ‌ల‌గ‌ల‌..

Star-Heroes-Shooting-In-RFC

ప్ర‌పంచంలో ఎక్క‌డా జ‌ర‌గ‌న‌న్ని షూటింగ్స్ రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతుంటాయి. ఒక్క‌రోజు కూడా ఇక్క‌డ స్టార్స్ సంద‌డి లేకుండా ఉండ‌దు. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. రామ్ చ‌ర‌ణ్, క‌ళ్యాణ్ రామ్, మోహ‌న్ బాబు లాంటి స్టార్స్ అంతా ఇప్పుడు ఆర్ఎఫ్ సీలోనే ఉన్నారు. నిన్న‌టి వ‌ర‌కు రంగ‌స్థ‌లం షూటింగ్ ఇక్క‌డే జ‌రిగింది. రామ్ చ‌ర‌ణ్ హీరోగా సుకుమార్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ ఆర్ఎఫ్సీలోనే జ‌రిగింది. అక్క‌డే కొన్ని బైక్ ఛేజింగ్ సీన్స్ తెర‌కెక్కించాడు సుకుమార్. ఇక కళ్యాణ్‌రామ్‌, తమన్నా జంట‌గా జ‌యేంద్ర తెర‌కెక్కిస్తోన్న చిత్ర షూటింగ్ కూడా అక్క‌డే జ‌రుగు తుంది. హీరో, హీరోయిన్లు రైల్లో ప్ర‌యాణించే సీన్ చిత్రీక‌రిస్తున్నాడు ద‌ర్శ‌కుడు జ‌యేంద్ర‌. ట్రైన్ సీన్స్ తోపాటు కాఫీ షాప్ సీన్స్ రామోజీ ఫిలింసిటీలోని రైల్వే స్టేషన్‌.. కాఫీడేల్లో తెరకెక్కిస్తున్నారు.

ఇక మంచు విష్ణు కూడా అక్క‌డే ఉన్నాడు. ఈయ‌న శ్రియతో పాటు పాటల పల్లకిలో మైమ‌రిచిపోతున్నారు. పక్కింట్లో సరదాగా కబుర్లు చెప్పుకుం టున్నారు. మ‌రి ఆ పాటేంటో.. ఆ కబుర్లేంటో గాయ‌త్రి సినిమాకే తెలుసు. మ‌ద‌న్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలోమోహ‌న్ బాబు క‌థానాయ‌కుడు. మంచు విష్ణు, శ్రియ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరిపై వచ్చే సీన్స్ ను ఫిలింసిటీలోని ఎమ్‌సిటీ బిల్డింగ్‌లోనూ.. పాటను పాల సముద్రం ఫీల్డ్‌ ఏరియాలోనూ చిత్రీకరిస్తున్నారు. మొత్తానికి అలా స్టార్స్ తో ఇప్పుడు ఆర్ఎఫ్ సీ క‌ళ‌క‌ళ‌లాడిపోతుంది.

More Related Stories