English   

సూర్య ఈ పోటీ త‌ట్టుకుంటాడా..? 

surya-gang

ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి హీరోతో పోటీ ప‌డాలంటే ఆ ధైర్యం మ‌రో రేంజ్ లో ఉండాలి. ఆయ‌న సినిమాకు టాక్ తో ప‌నిలేకుండా తొలి మూడు రోజులు వ‌సూళ్లు వ‌చ్చేస్తాయి. క‌నీసం అదైనా త‌ట్టుకునే శ‌క్తి ప‌క్క హీరోకు ఉండాలి క‌దా..! జ‌న‌వ‌రి 10న ఈయ‌న అజ్ఞాత‌వాసి విడుద‌ల అవుతుంది. దానికి రెండు రోజుల త‌ర్వాత బాల‌య్య జైసింహా వ‌స్తుంది.. అదేరోజు సూర్య డ‌బ్బింగ్ సినిమా గ్యాంగ్ కూడా వ‌స్తుంది. ఈ మ‌ధ్యే విడుద‌లైన గ్యాంగ్ టీజ‌ర్ కు ఊహించ‌ని రెస్పాన్స్ వ‌చ్చింది. జ‌న‌వ‌రి 5న హైద‌రాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుక కూడా జ‌ర‌ప‌నున్నారు. సూర్య కూడా దీనికి హాజ‌రు కాబోతున్నాడు. అంతేకాదు.. ఈ సినిమాలో త‌నే సొంతంగా డ‌బ్బింగ్ చెప్పుకున్నాడు సూర్య‌. త‌మ్ముడు కార్తి నుంచి పోటీ త‌ట్టుకోవాలంటే అన్న‌కు ఓన్ డ‌బ్బింగ్ త‌ప్పేలా లేదు. 

ఈ సినిమా హిందీలో వ‌చ్చిన అక్ష‌య్ కుమార్ స్పెష‌ల్ ఛ‌బ్బీస్ కు రీమేక్. గ్యాంగ్ టీజ‌ర్ చూస్తుంటే సినిమా క‌చ్చితంగా కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ అని తెలుస్తుంది. కానీ ఇప్ప‌టికే మ‌న ద‌గ్గ‌ర పండ‌క్కి ప‌వ‌న్, బాల‌య్య లాంటి హీరోలంతా రెడీగా ఉన్నారు. వీళ్ల‌ను త‌ట్టుకుని సూర్య గ్యాంగ్ ఎంత‌వ‌ర‌కు నిల‌బడుతుంది అనేది ఆస‌క్తిక‌రంగా మారిందిప్పుడు. గ‌త ఏడేళ్ల‌లో సింగం.. సింగం 2 త‌ప్ప మ‌రో హిట్ లేదు ఈ హీరోకు. మొన్నొచ్చిన సింగం 3 కూడా స‌రిగ్గా ఆడ‌లేదు. దాంతో ఇప్పుడు గ్యాంగ్ సినిమాపై భారీ ఆశ‌లే ఉన్నాయి. నానుం రౌడిధానుం త‌ర్వాత విఘ్నేష్ శివ‌న్ చేస్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై అంచ‌నాలు కూడా భారీగా ఉన్నాయి. కీర్తిసురేష్ హీరోయిన్. తాన సెరేంద కూట్టంలో ప‌క్కా పంచెక‌ట్టుతో ర‌ప్ఫాడిస్తున్నాడు సూర్య‌. మ‌రి తెలుగులో ఈ గ్యాంగ్ చేసే ర‌చ్చ ఎలా ఉంటుందో చూడాలిక‌..! 

More Related Stories