English   

సైరా మొద‌లైపోయిందోచ్..

Syera-Narasimha-Reddy-Shooting-Started

చిరంజీవి 15 ఏళ్ల క‌ల సాకారం కాబోతుంది. ఎన్నో ఏళ్లుగా క‌ల‌లు కంటోన్న సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా చివ‌రికి ప‌ట్టాలెక్కింది. ఇప్పుడు అప్పుడు అంటూ ఎప్ప‌టిక‌ప్పుడు త‌ప్పుడు తేదీలు వ‌చ్చినా చివ‌రికి డిసెంబ‌ర్ 6న ఈ చిత్రం ప‌ట్టాలెక్కింది. హైద‌రాబాద్ లోనే ఈ చిత్ర షూటింగ్ మొద‌లైంది. తొలిరోజు సెట్ లో మిగిలిన న‌టులు ఎవ‌రూ లేరు. కేవ‌లం చిరంజీవి మాత్ర‌మే. అవును.. మెగాస్టార్ పైనే తొలి షాట్ చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు సురేం ద‌ర్ రెడ్డి. హైద‌రాబాద్ లోని అల్యూమీనియం ఫ్యాక్ట‌రీలో వేసిన ప్ర‌త్యేక‌మైన సెట్ లో చిరంజీవిపై తొలి షాట్ చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు.

తొలి షెడ్యూల్లో చిరంజీవిపైనే సోలోగా సీన్స్ ప్లాన్ చేసాడు ద‌ర్శ‌కుడు. రామ్ చ‌ర‌ణ్ నిర్మించ‌నున్న ఈ చిత్రంలో న‌య‌న‌తార హీరోయిన్.  సైరా తొలిరోజు షూటింగ్ కు రామ్ చ‌ర‌ణ్ కూడా అందుబాటులోనే ఉంటాడు. అందుకే త‌న రంగ‌స్థ‌లంకు కూడా ప‌ది రోజులు బ్రేకిచ్చాడు చ‌ర‌ణ్. మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొంద‌నున్న ఈ చిత్ర విష‌యంలో ఎక్క‌డా కాంప్రమైజ్ కావ‌ట్లేదు రామ్ చ‌ర‌ణ్. సురేంద‌ర్ రెడ్డి కూడా అన్నీ ఫిక్సైన త‌ర్వాతే రంగంలోకి దిగుతున్నాడు. 10 రోజుల పాటు హైద‌రాబాద్ లోనే షూటింగ్ జ‌ర‌గ‌నుంది. ఆ త‌ర్వాత కొన్ని రోజులు బ్రేక్ ఇవ్వ‌నున్నారు. నెక్ట్స్ షెడ్యూల్ లో న‌య‌న‌తార‌తో పాటు సుదీప్, జ‌గ‌ప‌తిబాబు లాంటి వాళ్లు పాల్గొంటారు. మొత్తానికి సైరాను స‌రిగ్గా ప్లాన్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

More Related Stories