English   

థ‌మ‌న్ గోల్ మాల్ మొద‌లైపోయింది.. 

Thaman-s-Golmaal-Again-Started

అవును.. నిజంగానే గోల్ మాల్ చేస్తున్నాడు థ‌మ‌న్. ఎప్పుడూ రేస్ లో లేన‌ట్లే క‌నిపిస్తుంటాడు. కానీ ఎప్పుడూ అవ‌కాశాల వేట‌లో ముందే ఉంటాడు. అస‌లు అర్థం కాని ఫ‌జిల్ లా ఉంటాడు ఈ కుర్ర సంగీత ద‌ర్శ‌కుడు. ఇప్పుడు కూడా దేవీ శ్రీ ప్ర‌సాద్ జోరు ముందు త‌ల వంచిన‌ట్లే క‌నిపిస్తున్నాడు కానీ చేతిలో అర‌డ‌జ‌న్ సినిమాల‌కు పైగా బిజీగా ఉన్నాడు. ఈ మ‌ధ్యే థ‌మ‌న్ బాలీవుడ్ కు కూడా వెళ్లాడు. అక్క‌డ ఈయ‌న గోల్ మాల్ అగైన్ సినిమాకు సంగీతం అందించాడు. రోహిత్ శెట్టి తెర‌కెక్కించిన ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది. మ్యూజిక్ మ‌న‌కు రొటీన్ గా అనిపించినా.. థ‌మ‌న్ మ్యూజిక్ బాలీవుడ్ కు మాత్రం కొత్తే. ఆ ట్యూన్స్ అల‌వాటు ప‌డేవ‌ర‌కు వాడుకోవ‌చ్చు.

ద‌క్షిణాదిన కూడా థ‌మ‌న్ సూప‌ర్ బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం నాగార్జున హీరోగా ఓంకార్ తెర‌కెక్కిస్తోన్న రాజుగారిగ‌ది 2కు థ‌మ‌నే సంగీతం అందిస్తున్నాడు. ఇక అనుష్క భాగ‌మ‌తి సినిమాకు కూడా ఈయ‌నే సంగీతం అందిస్తున్నాడు. పి అశోక్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఇక వీటితో పాటు విక్ర‌మ్ త‌మిళ సినిమా స్కెచ్ కు ఈయనే సంగీత ద‌ర్శ‌కుడు. సాయి ధ‌రంతేజ్ జ‌వాన్.. నితిన్-కృష్ణ‌చైత‌న్య సినిమా.. వ‌రుణ్ తేజ్-వెంకీఅట్లూరి సినిమాకు కూడా థ‌మ‌నే సంగీత ద‌ర్శ‌కుడు. మొత్తానికి వ‌ర‌స‌గా ఇన్ని సినిమాలు ఉండ‌గానే.. బాలీవుడ్ లో మోత మొద‌లుపెట్టాడు థ‌మ‌న్.

More Related Stories