English   

 నేను ల‌వ్ ఫెయిల్యూర్ అంటోన్న ర‌జినీ.. 

rajinikanth-kaala

అవును.. నిజంగానే ర‌జినీకాంత్ కూడా ల‌వ్ ఫెయిల్యూరే అంట‌. ఈయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత అభిమానుల‌తో వ‌ర‌స‌గా మీటింగులు పెడుతున్నాడు. త‌న మ‌న‌సులో మాట‌ల‌ను వాళ్ల‌తో పంచుకుంటున్నాడు. ఇప్పుడు మ‌రోసారి అభిమానుల‌తో ఎన్నో ముచ్చ‌ట్లు పంచుకున్నాడు ర‌జినీ. ఈ కార్య‌క్ర‌మంలో చాలా విష‌యాలు మాట్లాడాడు సూప‌ర్ స్టార్. త‌న చిన్న‌ప్ప‌టి విష‌యాలు కూడా గుర్తు చేసుకున్నాడు. ఈయ‌న మ‌హారాష్ట్ర లో పుట్టి.. ఆ త‌ర్వాత క‌ర్ణాట‌క వ‌చ్చాడు. చిన్న‌పుడు అంద‌ర్లాగే త‌న‌కు కూడా ఓ లవ్ స్టోరీ ఉందని.. కానీ అది ఫెయిలైందని చెప్పాడు ర‌జినీకాంత్. చెన్నైలోని ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ చిన్నతనంలో జరిగిన కొన్ని విశేషాలను అక్కడున్న వారితో పంచుకున్నాడు. తను హైస్కూల్లో చదువుకునేటప్పుడు ప్రేమలో పడ్డానని.. కానీ ప్రేమించిన అమ్మాయి హృదయం గెలుచుకోలేకపోయానని అన్నారు. ఇప్పుడు ఆమె పేరు చెప్పి డిస్ట‌ర్బ్ చేయ‌డం కానీ.. అలా వివ‌రాలు బ‌య‌ట‌పెట్ట‌డం కానీ సంస్కారం కాద‌న్నారు ర‌జినీ. ఓ చిన్న ఇల్లు కొనుక్కొని మధ్యతరగతి మనిషిలా బతకాలన్నదే తన చిన్న కోరిక అని.. మంచి మంచి సినిమాలు చేసి ప్రేక్షకుల ముఖాల్లో ఇంకా ఇంకా సంతోషం  చూడటమే తన పెద్ద కోరిక అని చెప్పాడు సూప‌ర్ స్టార్. ఈయ‌న న‌టించిన 2.0 ఎప్రిల్ 14న విడుదల కానుంది. దాంతో పాటు కాలా జూన్ లో రిలీజ్ కానుంది. మొత్తానికి ఇప్పుడు కొన్ని కోట్ల మంది హృద‌యాల్లో ఉన్న ర‌జినీ.. అప్పుడు త‌ను కోరుకున్న‌ అమ్మాయి హృద‌యంలో మాత్రం చోటు సంపాదించ‌లేక‌పోయాడు.

More Related Stories