English   

నేటి యాంక‌ర్లే.. రేప‌టి హీరోలు..

TV-Anchors-Now-Turned-Heroes-on-Big-Screen

టీవీల్లో క‌నిపించ‌డం అంటే చిన్న విష‌యం కాదు.. ఒక్క మాట త‌డ‌బ‌డినా సీన్ సితారే. ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుంటే కానీ నోట్లోంచి మాట బ‌య‌టికి రాదు. యాంక‌రింగ్ లో అన్ని తిప్ప‌లుంటాయి. హోస్టింగ్ చేసిన వాళ్ల‌కు పెద్ద స్క్రీన్ పై క‌నిపించ‌డం పెద్ద క‌ష్ట‌మేం కాదు. బుల్లితెరపై వాళ్ల‌కు ఫుల్ గా క్రేజ్ ఉంటుంది. అదే క్రేజ్ ను ఇప్పుడు ద‌ర్శ‌క నిర్మాత‌లు వాడుకుంటున్నారు. తెలుగులో ఉన్న ఫీమేల్ యాంక‌ర్లు ఇప్ప‌టికే హీరోయిన్లు మారిపోయారు. కానీ మేల్ యాంక‌ర్లే ఇప్ప‌టి వ‌ర‌కు హీరోలుగా రాలేదు. త‌న‌దైన మాస్ యాంక‌రింగ్ తో ఫ్యాన్స్ ను సంపాదించుకున్న‌ ర‌వి.. ఇప్పుడు హీరోగా మారిపోతున్నాడు. బుల్లితెర‌పై ప‌టాస్ లాంటి సూప‌ర్ హిట్ ప్రోగ్రామ్స్ చాలానే చేస్తున్నాడు ఈ కుర్ర యాంక‌ర్.

ఇది మా ప్రేమ‌క‌థ సినిమాతో ఇప్పుడు హీరోగా మారిపోయాడు ర‌వి. అయోధ్య కార్తిక్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. చిరంజీవి చేతుల మీదుగా విడుద‌లైన టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. త్వ‌ర‌లోనే సినిమా విడుద‌ల కానుంది. ర‌వి ఒక్క‌డే ఈ చిత్రానికి ప్ర‌త్యేక‌థ‌. త‌న ఇమేజ్ పైనే సినిమా ఓపెనింగ్స్ ఆధార‌ప‌డి ఉన్నాయి. ఇక ఇప్పుడు ప్ర‌దీప్ కూడా హీరోగా మారుతున్నాడు. ఇప్ప‌టికే కొన్ని సినిమాల్లో కారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా న‌టించాడు ప్ర‌దీప్. లీడ్ ఆర్టిస్ట్ గా మాత్రం న‌టించ‌లేదు. ఎందుకో ఆ వైపుగా దృష్టి పెట్ట‌లేదు కూడా. ఇన్నాళ్ల‌కు మ‌నోడు ఓ కొత్త ద‌ర్శ‌కుడు చెప్పిన క‌థ న‌చ్చి.. హీరోగా మారుతున్నాడు.

తెలుగులో ఇంకా యాంక‌ర్లు హీరోలుగా స‌క్సెస్ కాలేదు కానీ త‌మిళ‌నాట మాత్రం అది జ‌రిగింది. అక్క‌డ ఇద్ద‌రు అగ్ర హీరోలు యాంక‌రింగ్ నుంచి వ‌చ్చిన వాళ్లే. వ‌ర‌స విజ‌యాల‌తో కోలీవుడ్ ను దున్నేస్తోన్న శివ‌కార్తికేయ‌న్ చిన్న చిన్న ఈవెంట్స్ కు.. ప్రోగ్రామ్స్ కు హోస్టింగ్ చేసిన‌వాడే. అచ్చంగా ర‌వి మాదిరే ఫుల్ ఎన‌ర్జీతో ఉంటాడు శివ‌. మెరీనా సినిమాతో హీరోగా ప‌రిచ‌యమై.. ఆ త‌ర్వాత వ‌ర‌స విజ‌యాల‌తో స్టార్ అయ్యాడు శివ కార్తికేయ‌న్. విజ‌య్ సేతుప‌తి కూడా ఇంతే. ఈయ‌న కూడా ముందు యాంక‌రింగ్ చేసాడు. మ‌ధ్య‌లో కొన్ని టీవీ సీరియ‌ల్స్ కూడా చేసాడు. ఆ త‌ర్వాతే హీరో అయ్యాడు. తెలుగులోనూ ర‌వి, ప్రదీప్ ఈ ట్రెండ్ కు తెర తీస్తాడని ఆశిస్తున్నారు. ఈ ఇద్ద‌రూ గ‌న‌క హీరోగా స‌క్సెస్ అయితే.. ఇప్పుడు ఉన్న మేల్ యాంక‌ర్ల‌కు ఇదో బూస్ట‌ప్ అవుతుంది. మ‌రి చూడాలి.. ఈ కుర్ర యాంక‌ర్ల క‌హానీ ఎంత‌మందిని ఆక‌ట్టుకుంటుందో..?

More Related Stories