English   

వాళ్లే నా ప్రపంచ‌మంటోన్న మ‌హేశ్..

Valle-Na-Prapanchamantunna-Mahesh

ఈ రోజుల్లో హీరోలు ఎంత బిజీగా ఉన్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మొన్న‌టి వ‌ర‌కు ఎన్టీఆర్ కు అస‌లు తీరిక లేదు. ఓ వైపు జై ల‌వ‌కుశ‌.. మ‌రోవైపు బిగ్ బాస్ షూటింగ్ ల‌తో త‌న త‌న‌యుడికి కూడా 70 రోజుల పాటు దూర‌మ‌య్యాడు ఎన్టీఆర్. కానీ అంత మిస్ చేసుకోవ‌డం త‌న వ‌ల్ల కాదంటున్నాడు మ‌హేశ్. సినిమాల్లో నటించడం అంటే ఆషామాషీ కాదు.. కోట్లాది మంది చూసే న‌టన చాలా ఒత్తిడితో కూడుకున్న ప‌ని.. ఈ ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలో తెలియక చాలామంది నలిగిపోతుంటారు. దీనికి మందు ఫ్యామిలీ అంటున్నాడు సూప‌ర్ స్టార్. సినిమాలు.. వ్యక్తిగత జీవితం బ్యాలెన్స్ చేసుకోవ‌డం కూడా తెలిసుండాలంటున్నాడు మ‌హేశ్. ఈ త‌రం హీరోలు అటు సినిమాల‌తో పాటు ఇటు రియాలిటీ షోల‌లో కూడా హోస్టులుగా చేస్తున్నారు క‌దా.. మీ సంగ‌తేంటి అంటే మ‌హేశ్ సింపుల్ గా త‌న‌కంత టైమ్ లేద‌ని తేల్చేసాడు. ఒకవేళ ఖాళీ సమయం ఉంటే ఫ్యామిలీ తో బ‌య‌ట‌కి వెళ్తానంటున్నాడు మ‌హేశ్.

పెద్ద సినిమాలు చేశామంటే అందులో ఇన్వాల్వ్ అయిన వారందరిపైనా విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. సినిమా సక్సెస్ కోసం అందరం ఎంతో శ్రమిస్తాం. రిలీజ్ టైం వచ్చేసరికి అందరిలోనూ ఎక్సయిట్ మెంట్ తో పాటు భ‌యం కూడా ఉంటుంది. అలాంటి స‌మ‌యాల్లో ఫ్యామిలీయే నాకు తోడు అంటున్నాడు మ‌హేశ్. పైగా గౌత‌మ్ కు ఇప్పుడు 11 ఏళ్లు.. అమ్మాయి సితార‌కు ఐదేళ్లు.. వాళ్ళు త‌న‌తో గ‌డిపే స‌మ‌యం కోసం వేచి చూస్తుంటారు కాబ‌ట్టి  ఏమాత్రం ఖాళీ టైమ్ దొరికినా వాళ్ల‌తో బ‌య‌టికి వెళ్తానంటున్నాడు సూప‌ర్ స్టార్. అంతేకానీ తన‌కు రియాలిటీ షోలు.. హోస్టుగా చేసేంత ఓపిక లేద‌ని చెప్పేసాడు మ‌హేశ్.

More Related Stories