English   

వెన్నెల కిషోర్ కెరీర్ తో ప్ర‌భాస్ ఆటలు.. 

Vennela-Kishore-Role-In-Sahoo-Revealed

క‌మెడియ‌న్లు ఎప్పుడూ క‌మెడియ‌న్లుగానే ఉండాలా.. వాళ్ల‌కు వేరే ఆఫ‌ర్లు రావా.. వ‌చ్చినా చేయ‌కూడ‌దా.. చేస్తే మ‌ళ్లీ కామెడీ రోల్స్ రావా..? ఇదిగో ఇలాంటి అనుమానాలే ఇప్పుడు ఇండ‌స్ట్రీలో వ‌స్తున్నాయి. లేక‌పోతే మ‌రేంటి.. ఓ సారి కామెడీ రోల్ చేస్తే వ‌ర‌స‌గా అలాంటి రోల్స్ ఇచ్చి ఆ న‌టున్ని ఓ జోన‌ర్ కే ప‌రిమితం చేస్తున్నారు మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు. అందుకే ఈ ట్రెండ్ కు చిన్న బ్రేక్ ఇస్తున్నాడు సుజీత్. ఈయ‌న తాను తెర‌కెక్కిస్తున్న సాహో సినిమాలో వెన్నెల కిషోర్ కు కీల‌క పాత్ర ఇస్తున్నాడు. అయితే అది అంతా ఊహించిన‌ట్లు కామెడీ రోల్ మాత్రం కాదు. ఇప్పటి వరకు కామెడీ చేసిన వెన్నెల కిషోర్.. సాహో కోసం సీరియ‌స్ పోలీస్ ఆఫీస‌ర్ గా మారిపోయాడు.

ఏ తరహా పాత్రలో అయినా కామెడీ పండించే వెన్నెల కిషోర్‌.. సాహోలో ఎలా చేస్తాడో అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇలా క‌మెడియ‌న్లు సీరియ‌స్ రోల్స్ చేయ‌డం ఇప్పుడే కొత్తేం కాదు. ఆ మ‌ధ్య క్ష‌ణంలో స‌త్యం రాజేష్ లో సీరియ‌స్ పోలీస్ ఆఫీస‌ర్ గా ర‌ప్ఫాడించాడు. ఇక మొన్న విడుద‌లైన స్పైడ‌ర్ లో.. త్వ‌ర‌లో విడుద‌ల కానున్న క‌ణంలో ప్రియ‌ద‌ర్శి పోలీస్ ఆఫీస‌ర్ గానే న‌టించాడు. మొత్తానికి సాహో సినిమా వెన్నెల కిషోర్ కెరీర్ ను మార్చ‌బోతుంది. మ‌రి అది ఎలా ఉండ‌బోతుందో చూడాలంటే వ‌చ్చే ఏడాది వ‌ర‌కు ఆగాల్సిందే..!

More Related Stories