English   

క‌న్న‌డ ఇండ‌స్ట్రీకి విజ‌య్ బిస్కెట్లు..

Vijay-Devarakonda-Steals-The-Show-At-Chammak-Audio-Launch

ఇక్క‌డ విజ‌య్ అంటే త‌మిళ హీరో విజ‌య్ కాదు.. మ‌న అర్జున్ రెడ్డి ఉర‌ఫ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌. మ‌నోడు ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడు. ఈ హీరోను ఇత‌ర హీరోలు ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తున్నారు. అలాగే ఈ మ‌ధ్యే ఛ‌మ‌క్ అనే క‌న్న‌డ సినిమా ఆడియో వేడుక‌కు వెళ్లాడు విజ‌య్ దేవ‌ర కొండ‌. అక్క‌డ మాట్లాడుతూ.. ర‌జినీకాంత్, అనుష్క శెట్టి, ఐశ్వ‌ర్యారాయ్ లాంటి గొప్ప న‌టుల‌ను మాకు అందించిన క‌ర్ణాట‌కకు ధ‌న్య‌వాదాలు తెలిపాడు విజ‌య్. త‌న పెళ్లిచూపులు సినిమా 100 రోజులు ఆడితేనే గ‌ర్వ‌ప‌డ్డాన‌ని.. కానీ గ‌ణేష్ న‌టించిన ఓ సినిమా ఏకంగా 800 రోజులు ఆడిందని తెలిసి షాకయ్యానని చెప్పాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

భారత్‌కు గొప్పనటులు.. క్రికెటర్లను పరిచయం చేసిన కర్ణాటక గురించి మాట్లాడుతూ.. కర్ణాటక అంటే రాహుల్‌ ద్రవిడ్‌, జవగళ్‌ శ్రీనాథ్‌, అనిల్‌ కుంబ్లే, వెంకటేశ్‌ ప్రసాద్‌.. ఇలా అంద‌రికీ కర్ణాటక అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అక్క‌డి నుంచే 40 శాతం క్రికెటర్లు వ‌చ్చారు. అంతేకాదు.. రజనీకాంత్‌, ఐశ్వర్యారాయ్‌ కూడా ఇదే రాష్ట్రం నుంచి వ‌చ్చారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమను ఊపేసిన అనుష్క సైతం కేరాఫ్ క‌ర్ణాట‌కే అంటూ కొనియాడాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇప్పుడు క‌న్న‌డ‌లో వ‌స్తోన్న సినిమాలు త‌న‌కు కూడా అక్క‌డ న‌టించాల‌ని ఉంద‌న్నాడు విజ‌య్. శివ‌రాజ్ కుమార్ న‌టించిన మ‌ఫ్టీ సినిమా ట్రైల‌ర్ చూసి షాక్ అయ్యాన‌న్నాడు విజ‌య్. మొత్తానికి క‌న్న‌డ ఇండ‌స్ట్రీకి కావాల్సిన‌న్ని బిస్కెట్లు వేసాడు ఈ అర్జున్ రెడ్డి.

More Related Stories