English   

సిద్ధార్థ్ ను ఫాలో అవుతున్న అర్జున్ రెడ్డి.. 

Vijay-Devarakonda

అర్జున్ రెడ్డి అంటే ఎవ‌రో తెలుసు క‌దా.. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఎవ‌రూ ఆయ‌న పేరుతో పిల‌వ‌ట్లేదు అంత‌గా అర్జున్ రెడ్డి పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసాడు ఈ కుర్ర హీరో. ఈ సినిమా ఇచ్చిన విజ‌యంతో ఇప్పుడు వ‌ర‌స సినిమాల‌తో ఊపిరి స‌ల‌ప‌లేనంత బిజీగా ఉన్నాడు విజ‌య్. ప్ర‌స్తుతం అరడజను సినిమాలు ఆయన చేతిలో వున్నాయి. వీటిలో మూడు చిత్రాలు సెట్స్‌పై వుండగా.. మిగిలిన మూడు త్వరలో ప్రారంభం కానున్నాయి. వీటిలో ఏది ముందొస్తుంద‌నే విష‌యంపై మాత్రం ఇప్ప‌టికీ క్లారిటీ లేదు. ప‌రుశురామ్ తో ఇప్పుడు చేస్తోన్న గీతాగోవిందం షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. గీతాఆర్ట్స్ లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇక ఇదే బ్యానర్ లో మ‌రో సినిమా క‌మిట‌య్యాడు విజ‌య్. ది ఎండ్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన రాహుల్‌తో త‌ర్వాతి సినిమా చేయ‌బోతున్నాడు విజ‌య్. ఇది పూర్తిగా హార్ర‌ర్ సినిమా. అంటే ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన సిద్ధార్థ్ గృహం త‌ర‌హా సినిమా అన్న‌మాట‌. అందులో కామెడీ ఉండ‌దు.. హార్ర‌ర్ అంటే కామెడీ అయిపోతున్న ఈ త‌రుణంలో వ‌చ్చిన సినిమా ఇది. ఇలాంటి సీరియ‌స్ దెయ్యం క‌థ‌తోనే విజ‌య్ వ‌స్తున్నాడు. జూన్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయాల‌ని చూస్తున్నారు. మ‌రి చూడాలిక‌.. దెయ్యంతో విజ‌య్ ఆట‌లు ఎలా ఉండ‌బోతున్నాయో..?

More Related Stories