English   

విక్ర‌మ్ ను అక్కినేని కంపౌండ్ దాట‌నివ్వ‌రా..? 

Vikram-Kumar-s-Next-With-Naga-Chaitanya

విక్ర‌మ్ కే కుమార్.. ఇప్పుడు ద‌క్షిణాదిన ఎక్క‌డ విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. మ‌నం లాంటి సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీని మాయ చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. దానికి ముందే ఇష్క్ తో త‌న ప్రేమ చూపించాడు. ఇక 24 సినిమాతో విక్ర‌మ్ రేంజ్ ఆకాశానికి పెరిగిపోయింది. ఇలాంటి ద‌ర్శ‌కున్నా మనం వ‌ద్ద‌న్న‌ది అంటూ విక్ర‌మ్ కు నో చెప్పిన కొంద‌రు హీరోలు బాధ ప‌డ్డారు కూడా. ఒక‌ప్పుడు ఒక్క అవ‌కాశం ఇవ్వండి బాబూ అంటూ హీరోల చుట్టు చెప్పుల‌రిగేలా తిరిగాడు విక్ర‌మ్. ఇప్పుడు విక్ర‌మ్ చుట్టూ స్టార్స్ తిరుగుతున్నారు. 13 బి, ఇష్క్, మ‌నం.. 24.. ఇప్పుడు హ‌లో సినిమాతో వ‌స్తున్నాడు విక్ర‌మ్.

కాంప్లికేటెడ్ క‌థ‌ల్ని కూడా కామ‌న్ పీపుల్ కు అర్థ‌మ‌య్యే స్క్రీన్ ప్లేతో విక్ర‌మ్ వండ‌ర్స్ చేస్తున్నాడు. ద‌ర్శ‌కుడిగా ఏదో ఓ అల్లాట‌ప్పా సినిమాలు కాకుండా ఇండియ‌న్ సినిమా రేంజ్ ను పెంచే విధంగా విక్ర‌మ్ సినిమాలు ముందుకు వెళ్తున్నాయి. మ‌నం సినిమా తెలుగు ఇండ‌స్ట్రీలో ఎప్ప‌టికీ నిలిచిపోయే ఓ క్లాసిక్. 24 కూడా ఇండియ‌న్ స్క్రీన్ పై ఇది వ‌ర‌కు చూడ‌న‌టువంటి ఓ అద్భ‌తుమైన సైన్స్ ఫిక్ష‌న్. ఇప్పుడు హ‌లో కూడా ప్రేమ‌క‌థ‌కే త‌న టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే జోడించాడు విక్ర‌మ్ కుమార్. అందుకే అక్కినేని కంపౌండ్ దాట‌నివ్వ‌డం లేదు ఈ ద‌ర్శ‌కున్ని నాగార్జున‌. ఈయ‌న త‌ర్వాతి సినిమా కూడా నాగచైత‌న్య‌తోనే ఉండ‌బోతుంద‌ని హ‌లో ఆడియో వేడుక‌లో అభిమానుల సాక్షిగా చెప్పాడు నాగ్. మొత్తానికి ఈయ‌న ద‌ర్శ‌కుడిగా అక్కినేని కుటుంబంతోనే క‌లిసిపోతాడేమో..?

More Related Stories