English   

విశాల్ భ‌య‌పెడుతున్నాడు..

Vishal-Making-Everyone-Frighten

త‌మిళ‌నాట ప్ర‌భుత్వానికి ఏది వ్య‌తిరేకంగా జ‌రిగినా.. ఎవ‌ర్ని భ‌యం లేకుండా నిల‌దీయాల‌న్నా ముందుగా వినిపించే పేరు విశాల్. ఈయ‌న‌కు భ‌యం అంటే ఏంటో తెలియ‌ద‌నుకుంటా..! ఎవ‌ర్ని ప‌డితే వాళ్ల‌ను టార్గెట్ చేస్తున్నాడు ఈ హీరో. మంచి కోసం ఎంత దూర‌మైనా వెళ్తానంటున్నాడు. ఇప్ప‌టికే ఎన్నో చేసిన విశాల్.. ఇప్పుడు కూడా ఇదే కంటిన్యూ చేస్తున్నాడు. రెబ‌ల్.. పోటుగాడు అంటారు క‌దా.. అవ‌న్నీ విశాల్ కు ప‌క్కాగా సూట్ అవుతాయి. రియ‌ల్ లైఫ్ కానీ.. రీల్ లైఫ్ కానీ తన‌కు అనిపించింది చేస్తూ పోతుంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు ఈ హీరో. ప్ర‌స్తుతం విశాల్ ఇరుంబు తిరై అనే సినిమా చేస్తున్నాడు. మిత్ర‌న్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంపైనే ఇప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ న‌డుస్తుంది. మిత్ర‌న్ ఈ చిత్రాన్ని జిఎస్టీకి వ్య‌తిరేకంగా తెర‌కెక్కిస్తున్నాడు.

దేశంలో ప్ర‌స్తుతం ఉన్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌.. డీమానిటైజేష‌న్ త‌ర్వాత జ‌రిగిన మార్పులు.. ప్ర‌జ‌ల అవస్థ‌లు ఇవ‌న్నీ ఇరుంబు తిరైలో చూపించ‌బోతున్నాడు ద‌ర్శ‌కుడు. పైగా న‌ల్ల‌ధ‌నం నిర్మూల‌న కోసం చేసిన డీమానిటైజేష‌న్ వ‌ల్ల దేశానికి లాభం ఏం జ‌ర‌గ‌లేద‌నేది కూడా సినిమాలో చూపించ‌బోతున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ విజువ‌ల్స్ చూస్తుంటే అందులో విశాల్ 2000 నోట్ల క‌ట్ట‌లు బోలెడు పెట్టుకుని ఉంటాడు. అర్జున్ ఇందులో విల‌న్ గా న‌టిస్తున్నాడు. స‌మంత హీరోయిన్. ఈ చిత్రం విడుద‌లైన త‌ర్వాత క‌చ్చితంగా జిఎస్టీ రచ్చ ఇంకా పెరుగుతుంద‌నేది కొంద‌రి వాద‌న‌. మ‌రి మెర్స‌ల్ లో రెండు నిమిషాల డైలాగ్స్ ఉంటేనే సినిమాను విడుద‌ల కాకుండా.. అయిన త‌ర్వాత నానా తిప్ప‌లు పెట్టారు. ఇప్పుడు విశాల్ ఏకంగా మొత్తం జిఎస్టీపైనే ఓ సినిమా చేస్తున్నాడు. మ‌రి ఆయ‌న్ని ఏం చేస్తుందో ఈ బిజేపీ ప్ర‌భుత్వం..?

More Related Stories