English   

ట‌చ్ చేసి చూడు ఆగిపోయిందా..? 

What-Happened-To-Ravi-Teja-s-Touch-Chesi-Chudu

ర‌వితేజ ఒకేసారి రెండు సినిమాల‌కు క‌మిటైన సంగ‌తి తెలిసిందే. రాజా ది గ్రేట్ కంటే ముందు ట‌చ్ చేసి చూడు సినిమానే మొద‌లుపెట్టాడు ర‌వితేజ‌. విక్ర‌మ్ సిరి అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ చిత్రంతో ప‌రిచ‌యం అవుతున్నాడు. షూటింగ్ కూడా స‌గానికి పైగా పూర్త‌యింది. కానీ ఇప్పుడు స‌డ‌న్ గా ట‌చ్ చేసి చూడు నుంచి ర‌వితేజ ప‌క్క‌కు జ‌రిగాడ‌ని తెలుస్తోంది. ఈ చిత్ర ఔట్ పుట్ ర‌వితేజ‌కు న‌చ్చ‌ట్లేద‌నే టాక్ వినిపిస్తుంది. క‌థ‌లో ఇంకొన్ని మార్పులు చేయాల్సిందిగా ద‌ర్శ‌కున్ని మాస్ రాజా కోరిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

అందుకే ట‌చ్ చేసి చూడు షూటింగ్ కు కొన్నాళ్లు బ్రేక్ ఇచ్చి.. రాజా ది గ్రేట్ పై మ‌న‌సు పెట్టాడు ర‌వితేజ‌. నిజానికి రాజా కంటే ముందు ట‌చ్ చేసి చూడు విడుద‌ల కావాలి. కానీ అది జ‌రిగేలా క‌నిపించ‌ట్లేదు. అక్టోబ‌ర్ 12న రాజా ది గ్రేట్ రానుంది. కుదిర్తే డిసెంబ‌ర్ లో గానీ.. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రీలో కానీ ట‌చ్ చేసి చూడు విడుద‌ల‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. క‌థ కొలిక్కి రాక‌పోతే అక్క‌డే ఆగిపోయే ప‌రిస్థితి కూడా లేక‌పోలేదు. మ‌రో వైపు ట‌చ్ చేసి చూడుకు క‌థ రాసిన వ‌క్కంతం వంశీ.. తాను ద‌ర్శ‌కుడిగా మారిన నా పేరు సూర్య‌తో బిజీగా ఉన్నాడు. దాంతో ర‌వితేజ ట‌చ్చింగుల‌కు ఇప్ప‌ట్లో కాలం క‌లిసొచ్చేలా క‌నిపించ‌ట్లేదు.

More Related Stories