English   

హ‌రీష్ తో హీరోల దాగుడు మూత‌లు..

What-will-Happen-To-Harish-Shankar-s-Daagudu-Moothalu

దాగుడు మూత‌లు అని టైటిల్ ఏ ముహూర్తంలో పెట్టుకున్నాడో తెలియ‌దు కానీ నిజంగానే హ‌రీష్ శంక‌ర్ తో దాగుడు మూత‌లు ఆడుకుంటున్నారు హీరోలు. ఈయ‌న దాగుడు మూత‌లు అనే స్క్రిప్ట్ రాసుకున్నాడు. క‌థ రాసి కూడా చాలా కాల‌మైంది. కాక‌పోతే ఇప్పుడు ఈ క‌థ‌కు హీరోలే దొర‌క‌డం లేదు. అస‌లే ఇండ‌స్ట్రీలో ఇప్పుడు ద‌ర్శ‌కుల‌కు క‌ష్ట‌కాలం న‌డుస్తుంది. ఖైదీ నెం. 150 లాంటి సినిమా త‌ర్వాత వినాయ‌క్ కే ఆర్నెళ్ల ఎదురు చూపులు త‌ప్ప‌లేదు. అలాంటిది డిజే లాంటి యావ‌రేజ్ సినిమా ఇచ్చిన హ‌రీష్ శంక‌ర్ ఇప్పుడు వెయిటింగ్ లో ఉండ‌టం త‌ప్పేం కాదు. పైగా పాత క‌థ‌ల‌నే కొత్తగా చెప్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇలాంటి వాడి పారేసిన పాత క‌థ‌నే డిజేతో చెప్పాడు. ఇవ‌న్నీ ప‌క్క‌న బెడితే డిజే త‌ర్వాత దాగుడు మూత‌లు క‌థ రాసుకున్నా.. హీరోలు మాత్రం మారిపోతూ ఉన్నారు. నిజంగానే ఈ క‌థ‌తో హీరోలు కూడా దాగుడు మూత‌లు ఆడుకుంటు న్నారు. ఈ చిత్రాన్ని త‌నే స్వ‌యంగా నిర్మించ‌నున్నాడు హ‌రీష్ శంక‌ర్.

దిల్ రాజు కూడా ఈ చిత్రానికి కాస్త హెల్ప్ చేస్తాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ కాంబినేష‌న్ లో ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన రామ‌య్యా వ‌స్తావ‌య్య ఫ్లాప్.. సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ హిట్.. డిజే యావ‌రేజ్.. ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్నా కూడా హ‌రీష్ కు మ‌ళ్లీ ఛాన్స్ ఇస్తున్నాడు దిల్ రాజు. ఆ మ‌ధ్య ఈ చిత్రం కోసం యుఎస్ లొకేష‌న్లు కూడా వెతికాడు హ‌రీష్ శంక‌ర్. ఇది ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ అని తెలుస్తుంది. ఈ సినిమా కోసం నాని.. శ‌ర్వానంద్ ల‌ను అడ‌గాలని చూస్తున్నాడు హరీష్ శంక‌ర్. అయితే నాని రేంజ్ ఇప్పుడు మారిపోయింది.

ఆయ‌న మ‌రో రెండేళ్ల వ‌ర‌కు బిజీ. ఈయ‌న స్థానంలోకి ఇప్పుడు నితిన్ వ‌చ్చేలా క‌నిపిస్తున్నాడు. ఈయ‌న కూడా ఇప్పుడు కృష్ణ‌చైత‌న్య సినిమాతో పాటు దిల్ రాజుతోనే శ్రీ‌నివాస‌క‌ళ్యాణం సినిమాకు క‌మిటయ్యాడు. ఇక‌ శ‌ర్వానంద్ కూడా సుధీర్ వ‌ర్మ‌తో పాటు హ‌ను రాఘ‌వ‌పూడి సినిమాకు క‌మిట‌య్యాడు. ఈ ఇద్ద‌రి సినిమాలు పూర్త‌య్యే వ‌ర‌కు హ‌రీష్ దాగుడు మూత‌ల‌కు మోక్షం లేన‌ట్లే..!

More Related Stories