English   

చేతులెత్తేసిన సూర్య‌.. సందీప్ డీలా..

What-Will-Happen-To-Sundeep-Kishan

ఇండ‌స్ట్రీలో గాడ్ ఫాద‌ర్ లేక‌పోతే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో కొంద‌రు హీరోల్ని చూస్తుంటే అర్థ‌మైపోతుంది. ఇంకొంద‌రికేమో గాడ్ ఫాద‌ర్ ఉండి.. బ్యాగ్రౌండ్ లో తోస్తూ ఉన్నా కూడా దాన్ని స‌రిగ్గా యూజ్ చేసుకోలేక‌పోతున్నారు. సందీప్ కిష‌న్ కూడా ఇందులో ఒక‌డే. మామ‌య్య ఛోటా కే నాయుడు పుణ్య‌మా అని ఇన్నాళ్లూ స‌రైన‌ హిట్లు లేక‌పోయినా సందీప్ బండి సాఫీగా న‌డుస్తూనే ఉంది. ప్ర‌తీ సినిమాకు అల్లుడి కోసం చేయాల్సిన త్యాగాల‌న్నీ చేస్తున్నాడు చోటా. కానీ అల్లుడే స‌రిగ్గా స్పందించ‌ట్లేదు.

అప్పుడెప్పుడో వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం ఓ యావ‌రేజ్ కూడా తీసుకురాలేక‌పోయాడు సందీప్ కిష‌న్. తాజాగా ఈ హీరో న‌టించిన కేరాఫ్ సూర్య గ‌త వార‌మే విడుద‌లైంది. సినిమాకు ముందు సుశీంద్ర‌న్ లాంటి ద‌ర్శ‌కుడితో ప‌నిచేయడం నా అదృష్టం అంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్పాడు సందీప్. కానీ సినిమా చూసిన ప్రేక్ష‌కులు మాత్రం అంత విష‌యం లేదంటున్నారు. అక్క‌డ‌క్క‌డా ఏవో మెరుపులు త‌ప్పితే సినిమా అంతా సోదే అంటున్నారు. పైగా ప్రతీ సీన్ లోనూ త‌మిళ తాళింపు ఎక్కువైంది. దానికితోడు ఈ మ‌ధ్య సుశీంద్ర‌న్ ట్రాక్ రికార్డ్ కూడా అంత‌గా బాగోలేదు. సందీప్ కూడా ఫ్లాపుల్లోనే ఉండ‌టం కేరాఫ్ సూర్య‌కు మ‌రింత‌ మైన‌స్ గా మారాయి. మొత్తానికి హిట్ కొట్టాల‌న్న సందీప్ క‌ల‌ను కేరాఫ్ సూర్య కూడా తీర్చ‌లేక‌పోయాడు.

More Related Stories