English   

అదుర్స్ 2 ఇంకెప్పుడు..? 

When-Will-Happen-Adhurs-2

ఎన్టీఆర్ సినిమాల్లో ఎప్పుడూ సీక్వెల్ చేయాల‌నుకునే ఒకే ఒక్క సినిమా అదుర్స్. వినాయ‌క్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఆల్ టైమ్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా నిలిచిపోయింది. ఎన్టీఆర్ కెరీర్ లో ఇంత‌కంటే కామెడీ సినిమా మ‌రోటి రాదు. అంత‌గా ఆ సినిమాలో చారి పాత్ర‌ను పండించాడు యంగ్ టైగ‌ర్. ఇక వినాయ‌క్ కూడా త‌న కెరీర్ లో అదుర్స్ కంటే ఎంట‌ర్ టైనింగ్ మూవీ చేయ‌లేన‌ని చెప్పేసాడు. ఈ చిత్రానికి సీక్వెల్ చేయాల‌ని చాలా కాలంగా టాక్స్ న‌డుస్తున్నాయి. ఎన్టీఆర్ కూడా అదుర్స్ 2పై త‌న కోరిక చెబుతూనే ఉన్నాడు. కానీ క‌థ మాత్రం దొర‌క‌డం లేదు. ఇప్పుడు అదుర్స్ సీక్వెల్ మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. జై ల‌వ‌కుశ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్ లో అభిమానుల ప్ర‌శ్న‌కు స‌మాధానంగా అదుర్స్ 2 చేస్తామంటూ ప్ర‌క‌టించాడు వినాయ‌క్. ప్ర‌స్తుతం సాయిధ‌రంతేజ్ తో ఓ సినిమా చేస్తున్నాడు ఈ మాస్ ద‌ర్శ‌కుడు. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ సినిమాపై దృష్టి పెడ‌తాడేమో..? మ‌రి చూడాలిక‌.. నిజంగాను అదుర్స్ 2 వ‌స్తుందా.. వ‌స్తే తొలి భాగంలా అల‌రిస్తుందా..?

More Related Stories