English   

ప‌ద్మావ‌తిపై అంత ప‌గ ఎందుకు..?

Why-Everyone-Targets-Padmavathi

చ‌రిత్ర‌ను చెప్పాల‌నుకోవ‌డం త‌ప్పు కాదు.. ఆ చ‌రిత్ర‌ను తెర‌కెక్కించే స‌మ‌యంలో కాస్త సినిమాటికి లిబ‌ర్టీ తీసుకుంటారు ద‌ర్శ‌కులు. లేక‌పోతే ఆ మాయ చేయ‌లేరు. భ‌న్సాలీ కూడా ఇదే చేస్తున్నాడు. ఈయ‌న త‌న ప్ర‌తీ సినిమాలోనూ చ‌రిత్ర‌నే క‌థాంశంగా తీసుకుంటున్నాడు. అయితే ఇక్క‌డే  ఓ విష‌యాన్ని మ‌రిచిపోతున్నాడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ. ఈ రోజుల్లో సినిమా తీయ‌డం ఈజీగానే ఉంది.. కానీ దాన్ని ఏ అడ్డంకి వివాదం లేకుండా విడుద‌ల చేయ‌డం క‌ష్టంగా మారుతుంది. అరే.. ఏ సినిమా చేసినా అందులో ఏదో ఓ వివాదం వెతికేస్తున్నారు కొంద‌రు. ఇప్పుడు దీపిక ప‌దుకొనే, సంజ‌య్ లీలా భ‌న్సాలీ ప‌ద్మావ‌తి విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. ఈ చిత్ర విడుద‌ల ఆపాల‌ని కొంద‌రు సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు. సిద్ధారాజ్ సింహ్ ఎం చుడాసమతో పాటు 11 మంది పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ పిటిషన్స్ పై విచారించిన సుప్రీం పద్మావతి సినిమాపై స్టే విధించేందుకు నిరాకరించింది. సెన్సార్ ఇచ్చే ముందే అన్ని వాళ్లే చూసుకుంటార‌ని.. మ‌ధ్య‌లో ఎవ‌రి జోక్యం అవ‌స‌రం లేద‌ని సుప్రీం వ్యాఖ్యానించింది. 1303 నాటి చారిత్రాత్మ‌క క‌థ ఇది. రాని ప‌ద్మిని దేవి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కించాడు భ‌న్సాలీ. రణవీర్ సింగ్, దీపికా పదుకొనే, షాహీద్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో అల్లావుద్ధీన్ ఖిల్జీ.. పద్మావతి మధ్య అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయ‌నే అనుమానం వ్య‌క్తం చేసింది కర్ణిసేన. జైపూర్ లో షూటింట్ జ‌రుగుతున్న సమయంలోనే గొడ‌వ‌లు కూడా చేసారు. ఈ విష‌యంపై భ‌న్సాలీ వివ‌ర‌ణ ఇచ్చిన త‌ర్వాత కూడా వాళ్ల కోపం చ‌ల్లార‌క‌పోవ‌డం విడ్డూరం. డిసెంబ‌ర్ 1న ప‌ద్మావ‌తి విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. రిలీజ్ త‌ర్వాత ఈ చిత్రం ఇంకెన్ని సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో..?

More Related Stories