English   

ఎన్టీఆర్ దూర‌మ‌య్యాడా.. దూరం పెట్టాడా..?

Why-Jr-NTR-Family-Maintaining-Distance-With-Balayya

నంద‌మూరి ఫ్యామిలీలో వివాదాలు ఉన్నాయ‌ని.. ఒక‌రితో మ‌రొక‌రికి ప‌డ‌ద‌ని బ‌య‌ట ఎన్నో వార్త‌లు వినిపిస్తున్నాయి. హ‌రికృష్ణ‌, బాల‌కృష్ణ కుటుంబాల మ‌ధ్య మాట‌లు కూడా లేవ‌ని చాలా కాలంగా వినిపిస్తున్న వార్తే. కానీ ఎవ‌రెన్ని మాట‌లు చెప్పినా.. అంతా ఆ అన్న‌గారి పేరు చెప్పుకుని ఉండేవాళ్లే. అయితే ఇప్పుడు నిజంగానే బాల‌య్య‌, హరికృష్ణ మధ్య మాట‌ల్లేవ‌నే విష‌యం జై ల‌వ‌కుశ ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ తో మ‌ళ్లీ ప్రూవ్ అయింది. ఇక్క‌డ అంత సేపు జ‌రిగిన వేడుక‌లో ఎక్క‌డా బాలయ్య పేరు కానీ.. బాబాయ్ నామ‌స్మ‌ర‌ణ గానీ రాలేదు. పైగా ఎన్టీఆర్ కూడా త‌న తాత‌ను త‌లుచుకున్నాడు కానీ బాబాయ్ ను మాత్రం త‌లుచుకోలేదు. ఎన్టీఆర్ వ‌ల్లే హ‌రికృష్ణ‌, క‌ళ్యాణ్ రామ్ కూడా బాల‌య్య‌కు దూరంగా ఉన్నార‌నే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. తమ్ముడికి స‌పోర్ట్ గా క‌ళ్యాణ్ రామ్.. త‌న‌యుల‌కు అండ‌గా హ‌రికృష్ణ‌.. బాల‌య్యకు దూరంగా ఉన్నార‌ని తెలుస్తోంది. చూడాలిక‌.. ఈ నంద‌మూరి నాట‌కం ఇంకెన్ని మ‌లుపులు తిర‌గ‌బోతుందో..?

More Related Stories