English   

ప‌వ‌న్ పై మ‌హేశ్ అంత కోప‌మా..?

Why-Mahesh-Kathi-Targets-Pawan-Kalyan

ఎవ‌రికి ఎప్పుడు సెలెబ్రెటీ స్టేట‌స్ వ‌స్తుందో తెలియ‌దు. ఇప్పుడు మ‌హేశ్ క‌త్తి ప‌రిస్థితి కూడా ఇలాగే త‌యారైంది. బిగ్ బాస్ షోతో ఈయ‌న పాపుల‌ర్ అయ్యాడు. దానికి ముందు క‌త్తి పేరు కేవ‌లం ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్ లో మాత్ర‌మే తెలుసు. కానీ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను విమ‌ర్శించి ఫేమ‌స్ అయ్యాడు మ‌హేశ్ క‌త్తి. కావాల‌నే ఇష్యూని పెద్ద‌ది చేసి.. మ‌హేశ్ క‌త్తిని పెద్దోన్ని చేస్తున్నారనే వాద‌న ఇండ‌స్ట్రీలో వినిపిస్తుంది. అస‌లు ఈ విష‌యాన్ని ఇంత సీరియ‌స్ గా తీసుకోవాల్సిన ప‌నిలేద‌ని కొంద‌రు అభిప్రాయం. అయితే ప‌వ‌న్ పై మ‌హేశ్ క‌త్తి చేసిన వ్యాఖ్య‌లు మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాయి. ప‌వ‌న్ అస‌లు న‌టుడే కాదు.. ఆయ‌న్ని ఎవ‌రు స‌ర్టిఫై చేసారు.. రాజ‌కీయ నాయ‌కుడిగా ప‌వ‌న్ ప‌నికిరాడు.. ఇలాంటి ప‌ద‌జాలాన్ని వాడాడు క‌త్తి. ఇది ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించింది.

ఇక్క‌డితో ఇష్యూను మూసేయ‌కుండా కావాల‌నే పెద్ద‌ది చేస్తున్నారనే ప్ర‌చారం కూడా జ‌రుగుతుంది. తాజాగా ప‌వ‌న్ ఇష్యూపై మ‌ళ్లీ స్పందించాడు క‌త్తి. ఈ విష‌యంలో ప‌వ‌న్ ముందుకొచ్చి అభిమానుల‌ను వారిస్తే బాగుంటుంద‌ని.. కానీ ప‌వ‌న్ కావాల‌నే కామ్ గా ఉంటున్నాడ‌ని.. ఇదంతా తాను కావాలనే చేయిస్తున్నాడంటున్నాడు మ‌హేశ్. ఈ విష‌యం మ‌ళ్లీ ర‌చ్చ అవుతుంది. అస‌లు క‌త్తి ఇలా ప‌వ‌న్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో మ‌రి ఆయ‌న‌కే తెలియాలి. నిజం చెప్పాలంటే బిగ్ బాస్ కంటే కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరుతోనే ఎక్కువ‌గా ఫేమ‌స్ అయ్యాడు మ‌హేశ్ క‌త్తి. మెగా హీరోలు మాత్రం ఈ ఇష్యూపై మాట్లాడకూడ‌ద‌ని కామ్ గా ఉన్నారు. తాము స్పందిస్తే మ‌హేశ్ క‌త్తి పెద్దోడైపోతాడ‌ని వాళ్ల ఫీలింగ్ అని తెలుస్తోంది. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు త‌న‌పై సెటైర్లు వేస్తోన్న జ‌బ‌ర్ద‌స్థ్ టీంపై కూడా విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించాడు మ‌హేశ్ క‌త్తి. మొత్తానికి ఈ ర‌చ్చ‌కు మ‌హేశ్ ఎప్పుడు పుల్ స్టాప్ పెడ‌తాడో చూడాలి మ‌రి..!

More Related Stories