English   

స్పైడ‌ర్.. జై ల‌వ‌కుశ‌.. భ‌యం భ‌యం.. 

Will-Spyder-And-Jai-Lava-Kusa-Break-That-Record

అదేంటి.. రెండూ స్టార్ హీరోల సినిమాలే క‌దా.. భ‌యం దేనికి అనుకుంటున్నారా..? స‌్టార్ హీరోల సినిమాలు కాబ‌ట్టే భ‌యం. చిన్న సినిమాలైతే బిజినెస్ కూడా త‌క్కువ‌గానే ఉంటుంది. కానీ ఇది కోట్ల‌తో య‌వ్వారం. ఒక్కో సినిమాకు 100 కోట్ల వ్యాపారం జ‌రుగుతుంది. ముఖ్యంగా స్పైడ‌ర్ అయితే 121 కోట్లు.. జై ల‌వ‌కుశ 86 కోట్ల వ‌ర‌కు బిజినెస్ జ‌రిగింది. ఈ మ‌ధ్య కాలంలో బాలీవుడ్ సినిమాలు కూడా కుళ్లుకునేలా మన మార్కెట్ 100 కోట్ల‌కు మించిపోయింది. కావాలంటే చూడండి స్పైడ‌ర్ బ‌డ్జెట్ 100 కోట్ల‌పైనే. తెలుగు త‌మిళ భాష‌ల్లో క‌లిపి ఇంత బ‌డ్జెట్ పెట్టారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఇదే స్థాయిలో జ‌రుగుతుంది. ఇప్ప‌టికే 130 కోట్ల మేర బిజినెస్ చేసారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లోనే ఈ చిత్రాన్ని 121 కోట్ల‌కు అమ్మారు. త‌మిళ్లో 17 కోట్ల‌కు అమ్మారు. బాహుబ‌లి త‌ర్వాత ఎక్కువ రేట్ల‌కు అమ్ముడైన తెలుగు సినిమా ఇదే. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే 69 కోట్ల బిజినెస్ చేసింది.

ఇక జై ల‌వ‌కుశ కూడా త‌క్కువేం తిన‌లేదు. అది రెండు భాష‌ల్లో క‌లిపి 120 కోట్ల బిజినెస్ చేస్తే.. జై ల‌వ‌కుశ తెలుగులోనే 86 కోట్ల‌కు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ చిత్రాన్ని ఆంధ్రా, తెలంగాణల్లో 67 కోట్ల‌కు అమ్మారు. ఓవ‌ర్సీస్ లో 9 కోట్ల‌కు వెళ్లింది సినిమా. క‌ర్ణాట‌క‌లో కూడా 8.5 కోట్ల‌కు తీసుకున్నారు. ఈ రెండు సినిమాలు హిట్ అనిపించుకోవాలంటే క‌చ్చితంగా ఇండ‌స్ట్రీ రికార్డులు తిర‌గ‌రాయాల్సిందే. స్పైడ‌ర్ విష‌యంలో 150 కోట్లు వ‌స్తే గానీ హిట్ అన‌లేం. ఇక జై ల‌వ‌కుశ‌ను కూడా క‌నీసం 100 కోట్లు రాక‌పోతే హిట్ అనే మాటే వాడ‌లేం. పైగా రెండు సినిమాలు కేవ‌లం వారం గ్యాప్ లోనే వ‌స్తున్నాయి. ఈ లెక్క‌న రెండింటికి బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ వ‌స్తే గానీ బ‌య‌ట‌ప‌డ‌వ‌న్న‌మాట‌.

More Related Stories