English   

విశాల్ విజ‌యం సాధిస్తాడా..?

Will-Vishal-Get-Success-In-Telugu

త‌మిళ్ తో పాటే తెలుగులోనూ చాలా త్వ‌ర‌గా ఇమేజ్ తెచ్చుకున్న హీరో విశాల్. అప్ప‌ట్లో పందెంకోడి, పొగ‌రు, భ‌ర‌ణి లాంటి సినిమాల‌తో వ‌ర‌స‌గా విజ‌యాలు అందుకున్నాడు విశాల్. ఆ ఇమేజ్ ఇప్పటికీ మ‌నోన్ని కాపాడుతుంది. అందుకే తాను న‌టించిన ప్ర‌తీ సినిమాను తెలుగులోనూ విడుద‌ల చేస్తుంటాడు విశాల్. ఇప్పుడు డిటెక్టివ్ అనే మ‌రో సినిమాతో వ‌చ్చాడు. తుప్ప‌రివాల‌న్ పేరుతో గ‌త నెల‌లో విడుద‌లైన ఈ చిత్రం త‌మిళనాట బాగానే ఆడింది. మిస్కిన్ తెర‌కెక్కించిన ఈ చిత్ర టికెట్ పై వ‌చ్చే డ‌బ్బులో ఒక్క రూపాయిని రైతుల కోసం ఇచ్చాడు విశాల్. శంక‌ర్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ కూడా డిటెక్టివ్ త‌మిళ వ‌ర్ష‌న్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. ప‌ట్టు స‌డ‌ల‌ని స్క్రీన్ ప్లేతో సినిమాను ప‌రుగులు పెట్టించాడు ద‌ర్శ‌కుడు మిస్కిన్.

ఈ చిత్రం హాలీవుడ్ సినిమా షెర్లాక్ హామ్స్ ఆధారంగా తెర‌కెక్కింది. తెలుగులో డిటెక్టివ్ గా న‌వంబ‌ర్ 10న వ‌చ్చింది. ఇక్క‌డ కూడా స్క్రీన్ ప్లే బాగుందంటున్నారు కానీ క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు ఉండాల్సిన ఒక్క ల‌క్ష‌ణం కూడా లేకుండా వ‌చ్చింది డిటెక్టివ్. మ‌రి ఇలాంటి సినిమా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుందా..? విశాల్ తెలుగు ఇమేజ్ ఈ చిత్రానికి యూజ్ అవుతుందా..? అను ఎమ్మాన్యువ‌ల్ ఇందులో హీరోయిన్ గా న‌టించింది. కొన్నేళ్లుగా స‌రైన హిట్ లేక విశాల్ తెలుగు మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయింది. ఇలాంటి టైమ్ లో వ‌స్తున్న డిటెక్టివ్ మ‌ళ్లీ త‌న‌కు పున‌ర్వైభవం తీసుకొస్తుంద‌ని న‌మ్ముతున్నాడు ఈ హీరో. మ‌రి చూడాలిక‌.. విశాల్ డిటెక్టివ్ తో మూడో క‌న్నుతెరుస్తాడో లేదో..?

More Related Stories