English   

చిరంజీవి ప‌రువు ప‌వ‌న్ తీస్తున్నాడా..?

Pawan-Kalyan
2018-11-04 09:44:30

అదేంటి.. మాట్లాడితే అన్న‌య్యే దేవుడు అంటాడు క‌దా.. అలాంటి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎందుకు చిరంజీవి ప‌రువు తీస్తాడు అనుకుంటున్నారా..? ఏమో తెలియ‌కుండానే ఇప్పుడు చిరు ప‌రువు మాటిమాటికి ఇన్ స్టాల్ మెంట్స్ లెక్క‌న ప‌వ‌న్ తీస్తున్న‌ట్లు అనిపిస్తుంది చూస్తున్న వాళ్ల‌కు. ఎందుకంటే ఈయ‌న రాజ‌కీయాల్లో ఉన్నాడిప్పుడు. జ‌న‌సేన గురించి క‌మెంట్ చేసేట‌ప్పుడు ప్ర‌జారాజ్యం గురించి కూడా మాట్లాడుతున్నాడు ప‌వ‌ర్ స్టార్. అక్క‌డే అన్న‌య్య గురించి ప్ర‌స్థావిస్తున్నాడు. ఇక ఇప్పుడు జ‌న‌సేన కూడా ప్ర‌జారాజ్యం మాదిరే ఎన్నిక‌ల త‌ర్వాత ఏదో ఓ పార్టీలో క‌లిసిపోతుంద‌ని క‌మెంట్స్ వినిపిస్తున్నాయి. 

దీనికి ప‌వ‌న్ ఊరికే ఉండ‌కుండా తుని బహిరంగసభలో మాట్లాడుతూ చావనైనా చస్తాగానీ పార్టీని మాత్రం వేరే ఏ పార్టీలోనూ విలీనం చెయ్యను అని ప్రకటించారు. ఇది మ‌రోవిధంగా చెప్పాలంటే ప్ర‌జారాజ్యంకు సెటైర్. మ‌న‌సులో అన్న‌య్య‌పై మాట్లాడాల‌నే ఉద్దేశం లేక‌పోవ‌చ్చు కానీ అక్క‌డ విలీనం టాపిక్ వ‌చ్చిన‌పుడు తెలియ‌కుండానే ప్ర‌జారాజ్యంపై ఎఫెక్ట్ ప‌డ‌క త‌ప్ప‌దు. చిరంజీవి, ప్రజారాజ్యం అనుభవాల దృష్ట్యా ప‌వ‌న్ కూడా చాలా జాగ్ర‌త్త‌గా జ‌నాల్లోకి వెళ్తున్నాడు. అడిగిన వాటికి చాలా ఓపిగ్గా స‌మాధానం చెబుతున్నాడు. ఒక‌ప్పుడు ప‌వ‌న్ లో ఉన్న కోపం ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. చాలా నెమ్మ‌దిగా మాట్లాడుతున్నాడు.

జ‌నాల‌తో క‌లిసే విధానంలోనూ మార్పు వ‌చ్చింది. అయితే ప్ర‌జారాజ్యం గురించి ప్ర‌జ‌లు మ‌రిచిపోయిన స‌మ‌యంలో కూడా ప‌వ‌న్ పదే పదే అదే టాపిక్ తీసుకురావ‌డం మాత్రం కోరి మ‌రీ చిరు ప‌రువు తీయ‌డం కిందే లెక్క‌. అయితే రాజ‌కీయ విశ్లేష‌కులు మాత్రం ఇది క‌రెక్టే అంటున్నారు. అనుక్ష‌ణం తాను అన్న‌య్యలా కాద‌ని.. ప్ర‌జారాజ్యంలా జ‌న‌సేన మార‌ద‌ని నిరూపించుకోవాలంటే ఇదే చెప్పాల‌ని అంటున్నారు కొంద‌రు. ప‌వ‌న్ కూడా ఇదే దారిలో వెళ్తున్నాడు ఇప్పుడు. అయితే ఏం చేసినా కూడా ప‌వ‌ర్ స్టార్ రూట్ చిరును ఇబ్బంది పెట్ట‌కుండా ఉంటే చాలంటున్నారు ఫ్యాన్స్. 

More Related Stories