English   

మేనల్లుడి కోసం చిరంజీవి ఎంట్రీ

Sai Dharam Tej Waiting Chiranjeevi Approval For Chitralahari Script
2018-11-04 20:24:36

చిరంజీవి అనేది పేరు కాదు.. బ్రాండ్. ఆ బ్రాండ్ చెప్పుకుని ఇప్ప‌టికే డ‌జ‌న్ మంది ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు.. ఇంకా వ‌స్తూనే ఉన్నారు. అయితే ఎంత మంది వ‌చ్చినా కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తూనే ఉన్నారు. వ‌ద్ద‌న‌కుండా నెత్తిన పెట్టుకుంటున్నారు. ఇక ఇప్పుడు సాయిధ‌రంతేజ్ విష‌యంలో చిరంజీవి కూడా మ‌ద‌న‌ప‌డుతున్నాడు. మేన‌ల్లుడు ముందు ర‌య్ మంటూ రాకెట్ లా దూసుకొచ్చినా కూడా ఆ త‌ర్వాత పూర్తిగా సైలెంట‌య్యాడు. ఒక్క‌టి రెండు అంటే ఏమో అనుకోవ‌చ్చు కానీ ఏకంగా అర‌డ‌జ‌న్ ఫ్లాపుల‌తో ఎవ‌రికీ క‌నిపించ‌కుండా పోయాడు సాయి. 40 కోట్ల హీరో అవుతాడు అనుకుంటున్న త‌రుణంలో వ‌రస ఫ్లాపులు ఈయ‌న ఇమేజ్ ప్ల‌స్ మార్కెట్ ను దెబ్బ‌కొట్టాయి. ఇక ఇప్పుడు ఈయ‌న త‌న విజ‌యం కోసం మామను రంగంలోకి దింపుతున్నాడు.

త‌న త‌ర్వాతి సినిమా చిత్ర‌ల‌హ‌రి బార్ అండ్ రెస్టారెంట్ క‌థ‌ను చిరంజీవికి వినిపిస్తున్నాడ‌ని తెలుస్తుంది. అలా చేసి త‌న స‌ల‌హాలు.. సూచ‌న‌లు తీసుకోవాల‌ని చూస్తున్నాడు సాయిధ‌రంతేజ్. ఎందుకంటే చిరు క‌థ విని ఓకే చెబితే తిరుగుండ‌దు. అలా చాలా సినిమాల‌కు ఇది ప్రూవ్ అయింది కూడా. అందుకే ఇప్పుడు సాయి కూడా ఇదే చేస్తున్నాడు. త‌న సినిమా క‌థ‌ను మేన‌మామకు వినిపిస్తున్నాడు. ఆయ‌న ఆశీస్సుల‌తో పాటు స‌ల‌హాలు కూడా తీసుకుంటున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మేన‌ల్లుడు క‌ష్టం చూసిన చిరు.. క‌థ విష‌యంలో ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల‌కు కొన్ని సూచ‌న‌లు ఇచ్చిన‌ట్లు తెలుస్తుంది. మ‌రి చూడాలిక‌.. మెగాస్టార్ సూచ‌న‌లు మేన‌ల్లుడికి ఎంత‌వ‌ర‌కు క‌లిసొస్తాయో..? ఈ చిత్రంలో క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

More Related Stories