English   

ఆయనొద్దన్నాడు.. నాని రమ్మన్నాడు

Director Vikram Kumar Story Allu Arjun Rejected Nani Accepted
2018-11-04 21:04:41

ఒక  హీరో రిజెక్ట్ చేసిన కథ మరో హీరోకు సూపర్ హిట్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా ఫలానా స్టార్ హీరో మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ ఇదని ఇప్పటికే చాలామంది హీరోల గురించి చాలా సినిమాల విషయాల్లో మాట్లాడుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి సంఘటనే మళ్లీ జరగబోతోందా అనేలా ఓ హీరోకు అనుకున్న కథ మరో హీరో వద్దకు వచ్చింది. ఎప్పట్లానే ఫస్ట్ హీరో కాదన్న కథను నెక్ట్స్ హీరో ఓకే చేశాడు. మరి ఆ ఫస్ట్ హీరో ఎవరో తెలుసా.. అల్లు అర్జున్. యస్.. అల్లు అర్జున్, విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడనే వార్తలు చాలకాలంగా వస్తున్నాయి. అయితే విక్రమ్ కుమార్ చెప్పిన కథ అల్లు అర్జున్ కు పూర్తిగా నచ్చలేదు. చాలా మార్పులు చేర్పులు చెప్పాడట. కానీ కథపై నమ్మకం ఉన్న విక్రమ్ కుమార్.. ఆ కథను మార్చడానికి ఒప్పుకోలేదు. కట్ చేస్తే ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో నటించేందుకు ఒకే చెప్పాడు అల్లు అర్జున్. దీంతో విక్రమ్ కుమార్ ఖాళీ అయిపోయాడు. బట్.. కథపై నమ్మకముండంటతో ఆ కథను నేచురల్ స్టార్ కు చెప్పాడు. విక్రమ్ కుమార్ తన కథను నానికి వినిపించాడు. నానికి బాగా నచ్చింది. దీంతో వెంటనే విక్రమ్ కుమార్ కు ఓకే చెప్పాడు.

ప్రస్తుతం నాని ‘జెర్సీ’ అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత వెంటనే విక్రమ్ కుమార్ తో సినిమా చేస్తాడు నాని. ఈ మూవీని మైత్రీ మూవీస్ వాళ్లు నిర్మించాలనుకుంటున్నట్టు టాక్. అయితే ఆల్రెడీ ఈ కథ గీతా ఆర్ట్స్ వారికి తెలుసు కాబట్టి.. నాని హీరో అయితే వాళ్లూ రెడీ అంటున్నారని సమాచారం. మరిఈ ఇద్దరిలో ఎవరు నిర్మిస్తారో కానీ.. అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన ఈ కథ నానికి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

More Related Stories