English   

విజయ్ వర్సస్ ఆమిర్ ఖాన్.. గెలుపెవరిది..?

Aamir-Khan
2018-11-05 11:03:29

విజయ్ వర్సెస్ ఆమిర్ ఖాన్ అనే పోలిక చాలా పెద్దది. అసలు ఈ ఇద్దరినీ కంపేర్ చేయడం అసంబద్ధం అంటారేమో.. కాన ఇది కేవలం సౌత్ లో మాత్రమే. అఫ్ కోర్స్ ఆమిర్ ఖాన్ కు సౌత్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ విజయ్ స్టామినాను తక్కువ చేయలేం. పైగా పండగ సీజన్ కాబట్టి.. విజయ్ ఫ్యాన్స్ నుంచి ఆమిర్ ఖాన్ కు గట్టి పోటీ తప్పదు. వాల్డ్ వైడ్ గా ఆమిర్ ఎంత కలెక్ట్ చేసుకున్నా.. సౌత్ లో ముఖ్యంగా తమిళనాడు, కేరళలో అది అంత సులువు కాదు. 

తమిళనాడులో విజయ్ కు స్ట్రాంగెస్ట్ ఫ్యాన్ బేస్ అండ్ మార్కెట్ ఉంది. అటు కేరళలో  కూడా అంతే. అందుకే ఈ ఇద్దరి మధ్య  పోటీ  ఉంటుందని చెప్పేది.ఇక ఆమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రినాకైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ట్రైలర్ మనవాళ్లను అంత గొప్పగా ఆకట్టుకుందని చెప్పలేం. నిజం.. రొటీన్ కమర్షియల్ సినిమాలాగే కనిపించింది.. తప్ప.. ఇందులో కొత్తగా ఏమీ లేదనే టాక్ వచ్చింది. పైగా థగ్గుల చరిత్ర వేరుగా ఉంటుంది. వీళ్లు చూపించేది అందుకు భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇదికూడా సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపిస్తుంది.
 
ఇక సర్కార్ అంటే విజయ్, మురుగదాస్ కాంబినేషన్ లో ఇప్పటి వరకూ వచ్చిన రెండు సినిమాలూ బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. బలమైన కంటెంట్ తో రావడం మురుదాస్ స్టైల్. అందుకు తగ్గట్టుగానే సర్కార్ లో కూడా కంటెంట్ బలం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ కంటే ముందేవస్తున్నాడు ఆమిర్ ఖాన్. ఇది కూడా అతనికి కలిసొస్తుంది. మరి దీపావళి పోటీలో విన్నర్ గా నిలిచే పటాస్ ఎవరో చూడాలి. 

More Related Stories