English   

రష్మిక మందన్నాకు బంపర్ ఆఫర్

Rashmika-Mandanna
2018-11-05 11:26:03

కొడితే(హిట్) సూపర్ స్టార్ సినిమాలో పడటం అంటే ఇదే. యస్.. టాలీవుడ్ కు వచ్చిన ఏ హీరోయిన్ అయినా చెప్పే రెగ్యులర్ అండ్ రొటీన్ డైలాగ్.. మీ ఫేవరెట్ హీరో ఎవరు అనగానే మొన్నటి వరకూ పవన్ కళ్యాణ్ పేరు ముందు చెప్పి తర్వాత మహేష్ బాబు అనడం.. ఇప్పుడు డైరెక్ట్ గా మహేష్ బాబు సరసన నటించడం నా డ్రీమ్ అని అనౌన్స్ చేయడం. అలా అనౌన్స్  చేసినట్టు ఖచ్చితంగా చెప్పలేం కానీ.. ఇప్పుడు గీత గోవిందం భామకు ఆ ఆఫర్ వచ్చేసింది. యస్.. అమ్మడు మహేష్ బాబు సరసన ఛాన్స్ కొట్టేసినట్టు లేటెస్ట్ గా న్యూస్ వస్తున్నాయి. అతి తక్కువ టైమ్ లోనే టాలీవుడ్  లో వంద కోట్ల మార్క్ కు  చేరుకున్న ఈ శాండల్ వుడ్ బ్యూటీకి ఇది ఊహించని ఆఫర్ అనే చెప్పాలి. కాకపోతే ఈ సినిమాలో తనే మెయిన్ హీరోయిన్ కాదు. మరో బ్యూటీ కూడా ఉంది. అయితేనేం.. మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ అనే మాట చాలదూ.. అమ్మడి రేంజ్ ఎంత పెరిగిందో చెప్పడానికి. ఇంతకీ రష్మికకు వచ్చిన ఈ ఆఫర్ ఏ సినిమాలోనో తెలుసా..?

ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి మూవీతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో సినిమా ఉంటుంది. ఆ మూవీలోనే రష్మికను హీరోయిన్ గా తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే సినిమాలో మెయిన్ హీరోయిన్ గా భరత్ భామ కియారా అద్వానీ కూడా నటిస్తోంది. యస్.. భరత్ అనేనేనుతో మహేష్ బాబు సరసన ఫస్ట్ ఆఫర్ కొట్టేసి టాలీవుడ్ కు గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన కియారాతో పాటు రష్మిక స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. మరి ఈ ఇద్దరి పాత్రలు ఎలా ఉంటాయో కానీ.. రష్మికకు వచ్చిన ఆఫర్ చిన్నదేం కాదు.

More Related Stories