English   

సర్కార్ కు మరోషాక్ తగిలింది..

sarkar
2018-11-05 12:47:28

మురుగదాస్ ఇన్నాళ్లుగా కాపీ కథలతో దూసుకుపోతున్నాడు. నిజం ఎన్నాళ్లో దాగదన్నట్టుగా సర్కార్ విషయంలో స్ట్రాంగ్ కౌంటర్ పడింది. ఈ కథ తనదంటూ ఓ రచయిత కోర్ట్ కు వెళ్లాడు. మొదట్లో ఈ కథ తనదే అంటూ, నా సొంంత పెన్ తో రాసుకున్నా అంటూ బుకాయించినా.. ఫైనల్ గా ఆ రచయితక సరెండర్ అయ్యాడు. అతనికి 30లక్షలు చెల్లించడంతో పాటు టైటిల్స్ లో కూడా పేరు వేస్తా అన్నాడు. అంతకు ముందే విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చినప్పుడు సిగరెట్ తాగే స్టిల్ ఎలా విడుదలచేస్తారంటూ నానా రచ్చ నడిచింది. అలాగే దసరాకు రావాల్సిన సినిమాను లేట్ చేశారంటూ అభిమానులు కూడా మురుగదాస్ పై సెటైర్స్ వేశారు. మొత్తంగా ఆరంభం నుంచీ ఏదో ఒక గొడవలో ఉంటూ వస్తోన్న సర్కార్ కు లేటెస్ట్ గా మరో షాక్ తగిలింది.

విజయ్, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కార్ సినిమా స్పెషల్ షోస్ కు అనుమతి ఇవ్వొద్దంటూ ఓ సామాజిక కార్యకర్త కేస్ వేశాడు. అసలు విజయ్ వంటి స్టార్స్ కెపాసిటీని ప్రూవ్ చేసేదే స్పెషల్ షోస్, బెన్ ఫిట్ షోస్. అలాంటిది వాటిని వద్దంటే అది ఖచ్చితంగా ఫస్ట్ డే కలెక్షన్స్ పై ప్రభావం చూపిస్తుంది. ఒక రకంగా ఈ మూవీతో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయాలనుకున్న సర్కార్ టీమ్ ఆశలు గల్లంతవుతాయి. ఆశ్చర్యంగా కోర్ట్ కూడా సర్కార్ మూవీకి స్పెషల్ షోస్ వేయొద్దంటూ తీర్పు చెప్పింది. దీంతో ఖంగు తిన్న సర్కార్ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ ఇక రెగ్యులర్ గా వెళ్లేందుకే సిద్ధమయ్యారు.

More Related Stories