English   

దర్శకేంద్రుడి పాత్రలో సెన్సిబుల్ డైరెక్టర్ 

Chandra-Siddhartha
2018-11-05 13:05:15

‘మహానాయకుడు’ నందమూరి తారకరామారావు సినిమా జీవితం చివరి దశలో ది బెస్ట్ మూవీస్ ఇచ్చిన దర్శకుడు దాసరి నారాయణరావు. ఒక రకంగా ఎన్టీఆర్ పార్టీ పెట్టడానికి ముందు వచ్చిన ఈ సినిమాలు ఆయన రాజకీయ అరంగేట్రానికి ఎంతో యూజ్ ఫుల్ గా ఉన్నాయి. అందుకే చివరి వరకూ ఎన్టీఆర్, దాసరిల మధ్య ‘సినీ అనుబంధం’ అలాగే కొనసాగింది. ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉన్నా.. అన్నిసినిమా ఫంక్షన్స్ లోనూ ఆత్మీయంగానే ఉన్నారు. ఇక 70,80ల కాలంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ఎన్నో సినిమలు సిల్వర్ జూబ్లీ ఆడేశాయి. 

ముఖ్యంగా సర్ధార్ పాపారాయుడు, బొబ్బిలిపులి వంటి సినిమాలు నేటికీ ఎవర్ గ్రీన్ గానే ఉన్నాయి. మరి అంత ప్రాధాన్యం దర్శకుడి పాత్రను ‘‘ఎన్టీఆర్’’బయోపిక్ లో ఎవరు చేస్తున్నారనే ప్రశ్నచాలారోజులుగా వినిపిస్తోంది. రీసెంట్ గా వి.వి. వినాయక్ ను అనుకున్నట్టు టాక్ వచ్చింది. బట్ ఫైనల్ గా దాసరి పాత్రలో కనిపించే  ‘దర్శకుడు’ దొరికేశాడు. సెన్సిబుల్ మూవీస్ తో ఆకట్టుకునే దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ ను దాసరి పాత్రలో తీసుకున్నారు. చంద్ర సిద్ధార్థ్ పర్సనాలిటీ, ఆహార్యం దాసరికి దగ్గరగానే ఉంటాయి. అందుకే ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నట్టు టాక్. అయితే ఇక్కడో విశేషం చెప్పాలి. 

బాలకృష్ణ ఈ బయోపిక్ మొదలుపెట్టినప్పుడు తేజ దర్శకుడుగా వచ్చాడు. కానీ మధ్యలో ఆయన వెళ్లిపోయాక.. కొన్నాళ్లు ఈ ప్రాజెక్ట్ ఆగిందిఅనుకున్నారు. అయితే అది నిజం కాదు. అప్పుడూ షూటింగ్ జరిగింది.యస్.. అప్పుడు దీనికి ‘ఘోస్ట్ డైరెక్టర్’ గా ఉన్నది చంద్ర సిద్ధార్థ. క్రిష్ ప్రాజెక్ట్ లోకి వచ్చిన తర్వాత చంద్ర సిద్ధార్థ్ తప్పుకున్నాడు. అలాంటిది అదే దర్శకుడు బయోపిక్ లో నటిస్తుండటం అంటే విశేషంగానే చెప్పాలి. 

More Related Stories