English   

తొందర అల్లు అర్జున్ దా.. త్రివిక్రమ్ దా..?

Allu-Arjun
2018-11-05 14:10:14

కొన్నిసార్లు కావాలని తీసుకున్న నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. కావాలని అనే దాంట్లో కంఫర్టబులిటీ ఉండొచ్చు.. కానీ అదీ మరీ లెంగ్తీ అయితేనే ఖచ్చితంగా చిరాకు వస్తుంది. ఈ కారణంగానే ఇప్పుడు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందబోయే సినిమాకు సంబంధించి వేగం పెంచుతున్నారు. నా పేరుసూర్య నా ఇల్లు ఇండియా ఫ్లాప్ తర్వాత అల్లు అర్జున్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. తనతోటి హీరోలు వైవిధ్యమైన కథలతో దూసుకువెళుతోంటే తను మాత్రం ఎక్కడో ఆగిపోయినట్టుగా గుర్తించాడు. మరోవైపు ఆ హీరోల రేంజ్ కు కూడా సంపాదించుకోలేకపోతున్నాడు. దీంతో సినిమా అంటూ చేస్తే ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిందే.. అలాంటి కథలకే ఓకే చెప్పాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. బట్ టైమ్ చూస్తే అలా కలిసొచ్చినట్టేం లేదు. చాలా కథలు విన్నా ఏదీ ఫైనల్ కాలేకపోయింది. మొత్తంగా చివరికి మళ్లీ త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనే వెళ్లబోతున్నాడు. అలాగని త్రివిక్రమ్ ఇంత వరకూ గొప్ప కథలేం చెప్పలేదు. అంటే మాగ్జిమం మళ్లీ కాంప్రమైజ్ అయినట్టే. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఈ డిసెంబర్ లో మొదలవుతుందని చెప్పారు. బట్.. ఇప్పుడా డేట్ మారింది. 

త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ రూపొందే సినిమా ఈ నెలలోనే ప్రారంభం అవుతుందని లేటెస్ట్ టాక్. వీరి కాంబోలో ఓ బాలీవుడ్ మూవీని రీమేక్ చేయాలనుకున్నట్టు టాక్ వచ్చింది. కానీ అదేం లేదని రీసెంట్ గా చెప్పారు. అంటే త్రివిక్రమ్ కథతోనే వెళుతున్నట్టు చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్య త్రివిక్రమ్ కథలపై కాపీ గాసిప్స్ బాగా వస్తున్నాయి. మరి ఈ కథకు అలాంటివేమైనా వస్తాయా లేదా అనేది చూడాలి. మొత్తంగా ఎవరు తొందర చేశారో తెలియదు కానీ డిసెంబర్ నుంచి ఈ ప్రాజెక్ట్ ఈ నవంబర్ సెకండ్ వీక్ కు వచ్చిందని చెబుతున్నారు. మరి ఇందులో అయినా నిజముందా అనేది చూడాలి. 

More Related Stories