English   

రాశిఖన్నాను ఎవరూ పట్టించుకోవడం లేదా...?

Raashi-Khanna
2018-11-05 16:25:54

రాశిఖన్నా.. ఊహలుగుసగుసలాడేతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ. ఫస్ట్ మూవీతోనే బెస్ట్ ఇంప్రెషన్ వేసి వరుస ఆఫర్స్ కొట్టేసింది. కానీ అవేవీ పెద్దగా హిట్ ఇవ్వలేదు. అయినా ఆఫర్స్ ఆగలేదు. కానీ చేసిన 14కు పైగా సినిమాల్లో అమ్మడి ఖాతాలో ఉన్న హిట్స్ కేవలం 3 మహా అయితే నాలుగు. నిజానికి కొన్నాళ్ల క్రితమే రాశి పని ఐపోయిందనుకున్నారు. బట్ ‘తొలిప్రేమ’తో బౌన్స్ బ్యాక్ అయింది. పర్సనాలిటీ కూడా బాగా తగ్గించుకుని కాస్త స్లిమ్ గా మారింది. తొలిప్రేమ అనూహ్యంగా హిట్ కావడంతో ఇక ఈ థైస్ బ్యూటీకి తిరుగులేదు అనుకున్నారు. అయితే ఆశ్చర్యంగా రాశిఖన్నాను ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో మకాం కోలీవుడ్ కు మార్చేసింది.

రాశి ప్రస్తుతం కోలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తోంది. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే.. అక్కడ కూడా మరీ స్టార్ హీరోలతో ఆఫర్స్ రావడం లేదు. ఇక్కడా అదే పరిస్థితి ఉండటం, అక్కడా అదే సిట్యుయేషన్ ఉండటం తన బ్యాడ్ లక్ కాక మరేంటీ..? నిజానికి ఎన్టీఆర్ సరసన ‘జై లవకుశ’ సినిమాలో ఆఫర్ వచ్చినప్పుడు ఇక రాశి దశ తిరిగిందనే అనుకున్నారంతా. కానీ ఆ పాత్ర కేమియోకు ఎక్కువ గెస్ట్ కు తక్కువ అన్నట్టుగా మారింది. మరీ కరివేపాకులా మారిందా పాత్ర. దీంతో మళ్లీ ఏ పెద్ద హీరో కూడా అమ్మడివైపు చూడలేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యే లక్షనాలున్నాయి అనుకున్న బ్యూటీ కాస్తా ఇప్పుడసలు స్మాల్ రేస్ లో కూడా లేకుండా పోవడం ఆశ్చర్యమే. మరి మళ్లీ తను తెలుగులోకి వస్తుందనే గ్యారెంటీ ఖచ్చితంగా ఇవ్వలేం. ఇక్కడ ఆల్రెడీ కొత్త భామల సందడి బాగా ఉంది. సో.. తనిక తమిళంలో అయినా స్టార్డమ్ పైకాన్ సెంట్రేట్ చేయడం బెటర్.. ఎలాగూ తమిళ తంబిలకు ఇలాంటి బొద్దుగుమ్మలంటే బాగా ఇష్టం. పైగా తను కూడా అందాల ప్రదర్శనలో మరీ అడ్డు  చెప్పదు. సో.. రాశిఖన్నా ఇక అక్కడైనా కుదురుకుంటుందేమో చూడాలి.

More Related Stories