English   

ప‌వ‌న్ గాడిన ప‌డ్డాడు.. ర‌జినీకాంత్ ఒక్క‌డే బాకీ.. 

Rajinikanth
2018-11-05 18:02:44

ర‌జినీకాంత్.. ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఇద్ద‌రూ ఇద్ద‌రే. ఇమేజ్ లో ఆకాశాన్ని లెక్కేయాలి. క‌లెక్ష‌న్స్.. క్రేజ్.. మార్కెట్ ఎలా చూసుకున్నా కూడా ర‌జినీ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆ స్థానంలోనే ఉంటాడు. సినిమాల‌తో మాత్ర‌మే వ‌చ్చిన ఇమేజ్ కాదు ఇది. ఇంకేదో కావాలి.. అది చూసి ప్రేక్ష‌కులు ఈ ఇద్ద‌ర్ని అంత‌గా ఇష్ట‌ప‌డుతున్నారు. ఇలాంటి ఇద్ద‌రు ఇప్పుడు ఒకే ప‌రిస్థితుల్లో ఉండ‌టం విచిత్రంగా అనిపిస్తుంది. ఇద్ద‌రికి కొన్నేళ్లుగా హిట్లు లేవు.. వ‌ర‌స డిజాస్ట‌ర్ల‌తో బ‌య్య‌ర్ల‌ను నిలువునా ముంచేస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర్దార్.. కాట‌మ‌రాయుడు.. అజ్ఞాత‌వాసితో చుక్కులు చూపించాడు. ఇక ర‌జినీకాంత్ కూడా లింగా.. క‌బాలి.. కాలా లాంటి సినిమాల‌తో ఫ్లాపులు ఇచ్చాడు. 

పైగా రాజ‌కీయంగానూ ఇద్ద‌రూ అనుభ‌వం లేనివాళ్లే. ఏదో చేస్తార‌ని ప్ర‌జ‌లు న‌మ్ముతున్నారు. కానీ వీళ్ల‌ను చూస్తుంటే మాత్రం అలా క‌నిపించ‌డం లేదు. మొన్న‌టి వ‌ర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల‌ను పెద్ద‌గా సీరియ‌స్ గా తీసుకోలేదు. సినిమాల‌తోనే బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆయ‌న మ‌న‌సు మార్చుకుని రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నాడు. ఓ వైపు ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తున్న వేళ జ‌నాల్లోకి వెళ్లిపోయాడు జ‌నసేనాని. ఇద్ద‌రికీ త‌మ త‌మ పార్టీల్లో తాము త‌ప్ప సెకండ్ గ్రేడ్ లీడ‌ర్స్ లేకుండానే ఉన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు అయితే పార్టీ క్యాడ‌ర్ కూడా లేదు. ర‌జినీకాంత్ క‌నీసం పార్టీ కూడా పెట్ట‌లేదు. 

పైగా ఈ ఇద్ద‌రూ ఎప్పుడు ఎలా ఉంటారో ఎవ‌రికీ అర్థం కాదు. అప్ప‌టిక‌ప్పుడు సినిమాలంటారు.. అప్ప‌టిక‌ప్పుడే రాజ‌కీయాలంటారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల‌ను బ‌ట్టి చూస్తుంటే ప‌వ‌ర్ స్టార్ ఇప్ప‌ట్లో సినిమాలు చేయ‌డం క‌ష్టంగానే క‌నిపిస్తుంది. కానీ ర‌జినీకాంత్ మాత్రం సినిమాలు కాద‌ని రాజ‌కీయాల వైపు రావ‌డం లేదు. అదే అస‌లు స‌మ‌స్య‌. రాజ‌కీయం పూర్తిగా చేయ‌కుండా అటు ఆకాశ‌మంత అభిమానాన్ని.. న‌మ్మ‌కాన్ని కూడా పోగొట్టుకునే ప‌రిస్థితికి వ‌చ్చాడు సూప‌ర్ స్టార్. దృష్టి పెడితే క‌చ్చితంగా అద్భుతాలు చేసే స‌త్తా ఉన్నా కూడా ఎటూ కాకుండా చూస్తున్నాడు. మ‌రి ప‌వ‌న్ గాడిన ప‌డిన‌ట్లే ర‌జినీ కూడా ఎప్పుడు గాడిన ప‌డ‌తాడో చూడాలిక‌. 

More Related Stories