English   

చైతూ మాస్ ఆశ‌లు మ‌ళ్లీ కంచికే.. 

Naga-Chaitanya
2018-11-05 18:32:22

పాపం ఓ హీరో ఇన్నిసార్లు మాస్ ఇమేజ్ కోసం పాకులాడటం ఇదే తొలిసారేమో మ‌రి..? ఎంతో బ్యాగ్రౌండ్ ఉండి కూడా మాస్ ఇమేజ్ కోసం నానా తంటాలు ప‌డుతున్నాడు నాగ‌చైత‌న్య‌. క్లాస్ హీరోగా ఇప్ప‌టికే మంచి ఇమేజ్ తెచ్చుకున్న ఈయ‌న‌కు మాస్ ఇమేజ్ అంటే అదోర‌కం పిచ్చి. అందుకే ఎన్నిసార్లు దెబ్బ‌తిన్నా కూడా మ‌ళ్లీ మ‌ళ్లీ ట్రై చేస్తుంటాడు. ఇప్పుడు కూడా మ‌రోసారి ఇదే చేసాడు చైతూ. స‌వ్య‌సాచితో మ‌రోసారి మాస్ ఇమేజ్ అంటూ వ‌చ్చేసాడు. ఈ సారి క‌థ బాగున్నా.. క‌థనం బాగోలేదు. దాంతో సినిమాకు తొలిరోజే యావ‌రేజ్ టాక్ వ‌చ్చింది.. క‌లెక్ష‌న్లు అయితే దారుణంగా వ‌చ్చాయి.
 
శైల‌జారెడ్డి అల్లుడు టాక్ తో ప‌నిలేకుండా తొలిరోజే 7 కోట్ల‌కు పైగా షేర్ తీసుకొస్తే ఇది కేవ‌లం 4 కోట్ల ద‌గ్గ‌రే ఆగిపోయింది. చూస్తుంటే రెండో రోజు అంత‌కంటే త‌క్కువ‌గా వ‌చ్చేలా ఉన్నాయి. వీకెండ్ అయ్యేనాటికి స‌ర్కార్ సినిమా విడుద‌లవుతుంది. దాంతో స‌వ్య‌సాచికి అష్టదిగ్భంద‌నం అయిపోయిందిప్పుడు. మ‌రోవైపు సినిమా సేఫ్ కావాలంటే 23 కోట్లు రావాలి. ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే అంత రావ‌డమ‌నేది అద్భుతం. ఆ అద్భుతం జ‌రిగేలా కూడా క‌నిపించ‌డం లేదు. మైత్రి మూవీ మేక‌ర్స్ విజ‌యాల‌కు క‌చ్చితంగా స‌వ్య‌సాచితో బ్రేక్ ప‌డేలా క‌నిపిస్తుంది. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్రంతో చైతూ ఎంత‌వ‌ర‌కు సేఫ్ జోన్ కు తీసుకెళ్తాడో..? 

More Related Stories