English   

ప్రభాస్.. ఒకేసారి ఇంతమంది ద‌ర్శ‌కులెందుకు..? 

Prabhas
2018-11-05 19:54:59

బిజినెస్ మ్యాన్ లో మ‌హేష్ బాబు చెప్పే డైలాగ్ గుర్తుందా..? ఇలా రౌండ‌ప్ చేసి క‌న్ఫ్యూజ్ చేయొద్దు.. క‌న్ఫ్యూజ‌న్ లో ఎక్కువ కొట్టేస్తా అని.. ప్ర‌భాస్ కూడా ఇప్పుడు ఇదే డైలాగ్ కాస్త మార్చి వాడుకుంటున్నాడు. కాక‌పోతే ఇప్పుడు ఈయ‌న చుట్టూ ద‌ర్శ‌కులు రౌండ‌ప్ చేసారు. బాహుబ‌లి కోసం ఐదేళ్లు తీసుకున్నాడ‌ని.. వ‌ర‌స‌గా మ‌రో ఐదేళ్లు స‌రిపోయేంత మందికి ఓకే చెప్పేస్తున్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్. ఇప్ప‌టికే సాహోతో బిజీగా ఉన్నాడు ఈ హీరో. ఈ చిత్ర షూటింగ్ కూడా చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. అంత‌లోనే రాధాకృష్ణ సినిమా కూడా ఓకే అయిపోయింది. ఈ చిత్ర షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇకిప్పుడు సుకుమార్ కూడా ప్ర‌భాస్ కోసం క‌థ రాస్తున్నాడ‌ని తెలుస్తుంది. అది కూడా వ‌చ్చే ఏడాది మొద‌ల‌వుతుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. రంగ‌స్థ‌లం త‌ర్వాత ఈయ‌న ఏం చేసినా సంచ‌ల‌నంగానే ఉంది. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు కోసం క‌థ సిద్ధం చేస్తున్న సుకుమార్.. త‌ర్వాత ప్ర‌భాస్ కోసం పెన్ను ప‌ట్ట‌నున్నాడు. ఇది కూడా డిఫెరెంట్ క‌థ అని తెలుస్తుంది. అయినా సుకుమార్ నుంచి రొటీన్ క‌థ‌లు ఊహించ‌డం కాస్త క‌ష్ట‌మే. అందుకే త‌న‌దైన శైలిలో ప్ర‌భాస్ కు ఓ క‌థ చెప్పి ఒప్పించాడ‌ని తెలుస్తుంది. ప్ర‌భాస్ కు కూడా బాగానే క‌నెక్ట్ కావ‌డంతో ఆ పాయింట్ పై క‌థ అల్లే ప‌నిలో ఉన్నాడు సుకుమార్. మ‌రోవైపు మ‌హేష్ కూడా లైన్ లోనే ఉన్నాడు. మ‌రి ప్ర‌భాస్ ఇంకెంత‌మంది ద‌ర్శ‌కుల‌ను ఇలా లైన్ లో పెడ‌తాడో చూడాలిక‌. 

More Related Stories