English   

వెంకటేష్ కూతురు పెళ్లి డేట్ ఫిక్స్ అయింది

Venkatesh Daughter Ashritha Marriage Date Confirmed
2018-11-06 06:45:13

అవును.. వెంక‌టేష్ ఇంట్లో పెళ్లి భాజాలు మోగ‌బోతున్నాయి. ఆయ‌న‌కు పెళ్లీడుకు వ‌చ్చిన కూతుళ్లు ఉన్నారు. ఇందులో పెద్ద కూతురు అశ్రిత‌కు ఇప్పుడు పెళ్లి నిశ్చ‌య‌మైంది. ఈమె ప్రేమ వివాహం చేసుకుంటుంద‌ని తెలుస్తుంది. ఈ మ‌ధ్య ఇండ‌స్ట్రీలో ల‌వ్ స్టోరీస్ ఎక్కువైపోతున్నాయి. మొన్న రాజ‌మౌళి కొడుకు కార్తికేయ కూడా త‌న‌కు న‌చ్చిన అమ్మాయిని ఇంట్లో ప‌రిచ‌యం చేసి పెళ్లికి సిద్ధ‌మైపోయాడు. ఇప్పుడు వెంక‌టేష్ కూతురు అశ్రిత కూడా ఇదే చేస్తుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇప్పుడు అందుతున్న స‌మాచారం వ‌ర‌కు వెంకీ కూతురు ప్ర‌ముఖ బిజినెస్ మ్యాన్ సురేంద‌ర్ రెడ్డి మ‌న‌వ‌న్ని ప్రేమించింది. నవంబర్ 24 న ఆశ్రిత పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.

దీనికోసం ఏర్పాట్లు కూడా జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే వాళ్ల ఇంటికి వెళ్లి సురేష్ బాబు కూడా మాట్లాడి వ‌చ్చాడ‌ని తెలుస్తుంది. హైదరాబాద్ రేస్ క్లబ్ ఛైర్మన్ గా ఆర్.సురేందర్ రెడ్డి ఉన్నారు. వెంక‌టేష్ ప్ర‌స్తుతం ఎఫ్ 2 షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తైన త‌త‌ర్వాత కూతురు పెళ్లి వేడుకతో బిజీ కానున్నాడు. కాగా అశ్రిత ఫుడ్ బిజినెస్ లో ఉంది. ఈమె ప్రొఫెషనల్ బేకర్. ఇన్ ఫినిటీ ప్లేటర్ పేరుతో ఇప్ప‌టికే హైదరాబాద్ లో కొన్ని స్టాల్స్ కూడా ఏర్పాటు చేసింది ఈమె. రామానాయుడులో కూడా ఈ స్టాల్ ఉంది. ఇక వ‌రుడు తండ్రి ర‌ఘురామిరెడ్డి మాజీ ముఖ్య‌మంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మంచి స్నేహితుడు. మొత్తానికి త్వ‌ర‌లోనే ద‌గ్గుపాటి వారింట పీపీపీ డుండుండుం వినిపించ‌నున్నాయి.

More Related Stories