English   

నాగ చైతన్యకు పెద్ద దెబ్బే,..!

Naga Chaitanya's Savyasachi Worldwide Four Days Collections
2018-11-06 07:24:49

స‌వ్య‌సాచి సినిమా ప‌రిస్థితి చూస్తుంటే ఇప్పుడు ఇదే అనిపిస్తుంది మరి. ఈ చిత్రం నాలుగు రోజుల్లో 10 కోట్ల షేర్ కూడా అందుకోలేదు. ముఖ్యంగా తొలి వీకెండ్ కేవ‌లం 8 కోట్ల ద‌గ్గ‌రే స‌రిపెట్టుకుంది. ఇక వీక్ డేస్ మొద‌లైన త‌ర్వాత ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారిపోయింది. శైల‌జారెడ్డి అల్లుడు సినిమాతో ఓపెనింగ్స్ భారీగా రాబ‌ట్టిన చైతూ.. ఈ సారి అది కూడా చేయ‌లేక‌పోతున్నాడు. ఎందుకో తెలియ‌దు కానీ తొలి షో నుంచే స‌వ్య‌సాచిపై టాక్ తేడాగా వ‌చ్చేసింది. దాంతో క‌లెక్ష‌న్లు కూడా అలాగే ఉన్నాయి. శైల‌జారెడ్డి అల్లుడు టాక్ తో ప‌నిలేకుండా తొలిరోజే 7 కోట్ల‌కు పైగా షేర్ తీసుకొస్తే ఇది కేవ‌లం 4 కోట్ల ద‌గ్గ‌రే ఆగిపోయింది. రెండో రోజు అంత‌కంటే త‌క్కువ‌గా వ‌చ్చాయి. వీకెండ్ అయ్యేనాటికి ప‌రిస్ధితి 8 కోట్ల ద‌గ్గ‌రే ఆగింది. ఇక ఇప్పుడు స‌ర్కార్ వ‌చ్చిందంటే స‌వ్య‌సాచి ఎటూ కాకుండా పోవ‌డం ఖాయం. మ‌రోవైపు సినిమా సేఫ్ కావాలంటే 23 కోట్లు రావాలి. ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే అంత రాదు ఒకవేళ వస్తే అద్భుతమే. ఆ అద్భుతం జ‌రిగేలా కూడా క‌నిపించ‌డం లేదు. వ‌ర‌స విజ‌యాల‌తో జోరు మీదున్న మైత్రి మూవీ మేక‌ర్స్ కు ఇప్పుడు బ్రేక్ ప‌డిపోయింది. దాంతో ఇప్పుడు వాళ్ల ఆశ‌ల‌న్నీ అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీపైనే ఉన్నాయి.

More Related Stories