English   

స‌ర్కార్ ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో టాక్.. 

Sarkar-First-Show
2018-11-06 08:24:34

ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైంది స‌ర్కార్. విజ‌య్ హీరోగా మురుగ‌దాస్ తెర‌కెక్కించిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వ‌చ్చింది. ముఖ్యంగా విజ‌య్ ఫ్యాన్స్ కు ట్రీట్ అంటున్నారు ఆడియ‌న్స్. న‌వంబ‌ర్ 5 రాత్రే యుఎస్ ప్రీమియ‌ర్స్ ప‌డ్డాయి కానీ త‌మిళ‌నాట మాత్రం న‌వంబ‌ర్ 6 ఉద‌యం 4 గంట‌ల నుంచే షోలు మొద‌ల‌య్యాయి. అభిమానుల కోలాహ‌లం మ‌ధ్య స‌ర్కార్ బొమ్మ థియేట‌ర్స్ లోకి వ‌చ్చింది. తుపాకి మిల‌ట‌రీ.. క‌త్తిలో రైతుల గురించి చెప్పిన మురుగదాస్ ఈ సారి స‌ర్కార్ లో ఓటర్లు.. ఓట్ల గొప్ప‌త‌నం గురించి చెప్పాడు. సినిమా క‌థ ప‌రంగా చూస్తే పాత‌దే అయినా స్క్రీన్ ప్లే మాత్రం బాగుందంటున్నారు ప్రేక్ష‌కులు. ముఖ్యంగా విజ‌య్ స్క్రీన్ ప్ర‌జెన్స్ కు తోడు ఆయ‌న డాన్సులు, డైలాగులు సినిమాకు హైలైట్ గా నిలిచే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అయితే ఓల్డ్ స్టోరీ.. కాస్త రొటీన్ స్క్రీన్ ప్లే మాత్రం సినిమాను బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ నుంచి దూరం చేసాయి. దివాళీ ఉంది కాబ‌ట్టి క‌చ్చితంగా స‌ర్కార్ ఆ పండ‌గ సెల‌వుల‌ను క్యాష్ చేసుకుంటుంద‌నండంలో సందేహం లేదు. తెలుగులో కూడా టాక్ బాగానే ఓపెన్ అయ్యేలా క‌నిపిస్తుంది. ఇక్క‌డ అదిరిందితో హిట్ కొట్టిన విజ‌య్.. స‌ర్కార్ తో అది కొన‌సాగిస్తాడా లేదా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. 

More Related Stories