English   

అబ్బ‌బ్బా.. సావిత్రి మ‌ళ్లీ బ‌తికొచ్చిందా..? 

Nithya-Menen
2018-11-06 09:32:23

ఏమో ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ లో సావిత్రి ఫస్ట్ లుక్ చూసిన త‌ర్వాత అంద‌రికీ ఇదే అనుమానం వ‌స్తుంది. కీర్తిసురేష్ ఎంత ఒదిగిపోయినా కూడా రూపంలో మాత్రం సావిత్రి పోలిక‌లు ఎక్కువ‌గా నిత్యామీన‌న్ లోనే క‌నిపిస్తున్నాయి. అయినా సావిత్రి అంటే ఒక‌ప్పుడు ఆ మ‌హాన‌టి గుర్తొచ్చేది.. కానీ ఈ మ‌ధ్య అభిన‌వ సావిత్రిగా కీర్తిసురేష్ న‌ట‌న‌కు అంతా ఫిదా అయిపోయారు. నిజంగానే సావిత్రి ఆత్మ కీర్తిలో ఉందేమో అనేంత‌గా ఆమెను త‌న‌లో చేర్చుకుంది కీర్తి. మ‌హాన‌టి కేవ‌లం కీర్తిసురేష్ న‌ట‌న వ‌ల్లే అంత పెద్ద విజ‌యం సాధించిందంటే అతిశ‌యోక్తి కాదు. భావి త‌రాల‌కు సావిత్రి ఎవ‌రు అంటే మ‌రోమాటే  లేకుండా కీర్తి పేరు గుర్తొస్తుంది. అంత‌గా ఆ పాత్ర‌లో ఒదిగిపోయి ప్ర‌శంస‌లు అందుకుంది ఈ ముద్దుగుమ్మ‌. అయితే ఇప్పుడు నిత్యామీన‌న్ దాన్ని మ‌రిపించే ప‌నిలో ప‌డిపోయింది.

నిజానికి ఎన్టీఆర్ బ‌యోపిక్ లో కూడా కీర్తిసురేష్ నే సావిత్రి పాత్ర కోసం అడిగారు కానీ ఆమె ఒప్పుకోక‌పోవ‌డంతో నిత్యామీన‌న్ ను ఈ పాత్ర కోసం తీసుకున్నారు. ఇప్పుడు లుక్ విడుద‌లైంది. ఇది చూసిన త‌ర్వాత అస‌లు నిత్యామీన‌న్ కంటే బాగా సావిత్రి రోల్ కు ఎవ‌రు స‌రిపోతారు అనేలా క్రిష్ ఇందులో ఆమెను చూపించాడు. పైగా గుండ‌మ్మ క‌థ‌లో పిండిరుబ్బే సీన్ ఫ‌స్ట్ లుక్ గా రావ‌డం.. అచ్చంగా సావిత్రి మాదిరే నిత్యామీన‌న్ క‌నిపించ‌డంతో ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్. సినిమా విడుద‌లైన త‌ర్వాత నిత్యా కంటే సావిత్రిగా ఎవ‌రూ బాగా సెట్ కాలేర‌ని ప్రేక్ష‌కులు అంటార‌ని ధీమాగా చెబుతున్నాడు క్రిష్. అన్న‌ట్లు మ‌హాన‌టి కోసం కూడా ముందు నిత్యామీన‌న్ ను అనుకున్న త‌ర్వాత కీర్తి వైపు క‌దిలాడు నాగ్  అశ్విన్. ఇప్పుడు మ‌ళ్లీ వెతుక్కుంటూ సావిత్రి రోల్ నిత్యా ద‌గ్గ‌రికే వ‌చ్చింది. 

More Related Stories