English   

అందాల నిధిని ప‌ట్టుకుంటున్న మెగా మేన‌ల్లుడు.. 

Nidhhi-Agerwal
2018-11-06 10:01:50

ఇండ‌స్ట్రీ మొత్తం 20 మంది హీరోలుంటే అందులో మెగా కుటుంబం నుంచే 10 మంది ఉన్నారు. అస‌లు ఒకే కుటుంబం నుంచి ఇంత మంది హీరోలు రావ‌డం ఏంటి అని కొంద‌రు విమ‌ర్శిస్తున్నారు కూడా. కానీ అదేం విచిత్ర‌మో కానీ మెగా కుటుంబం నుంచి ఎంతమంది హీరోలు వ‌చ్చినా కూడా ఆద‌రించ‌డానికి ప్రేక్ష‌కులు కూడా సిద్ధంగానే ఉన్నారు. ఇప్ప‌టికే చిరు.. ప‌వ‌న్.. బ‌న్నీ.. చ‌ర‌ణ్ కాకుండా వ‌రుణ్ తేజ్, సాయిధ‌రంతేజ్ కూడా నిల‌బ‌డి పోయారు. ఇక శిరీష్ సైతం త‌న వంతు ప్ర‌య‌త్నాలేవో చేస్తున్నాడు. ఆ మ‌ధ్య చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ సైతం విజేత అంటూ వ‌చ్చి ఫ్లాప్ ఇచ్చాడు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఈయ‌న క‌నిపించ‌లేదు. ఇక ఇప్పుడు మ‌రో హీరో కూడా ఇదే కుటుంబం నుంచి వ‌చ్చేస్తున్నాడు. సాయిధ‌రంతేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ కూడా హీరో అవుతున్నాడు. ఈ కుర్రాడి సినిమాను భారీగానే లాంఛ్ చేస్తున్నారు. 

ప్ర‌తిష్టాత్మ‌క మైత్రి మూవీ మేక‌ర్స్.. సుకుమార్ రైటింగ్స్ క‌లిసి వైష్ణ‌వ్ తేజ్ ను లాంఛ్ చేస్తున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నిధి అగ‌ర్వాల్ న‌టిస్తుందని తెలుస్తుంది. ఈ మ‌ధ్యే స‌వ్య‌సాచితో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయింది ఈ భామ‌. ఈ చిత్రాన్ని నిర్మించింది కూడా మైత్రి మూవీ మేక‌ర్సే. ఆ సాన్నిహిత్యంతోనే మ‌ళ్లీ నిధి వైపు మైత్రి అడుగులు ప‌డుతున్నాయి. ఇక వైష్ణ‌వ్ తేజ్ ఎంట్రీ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. మెగా అల్లుడు అనే ఒక్క బ్రాండ్ చాలు.. వైష్ణ‌వ్ తేజ్ ఇండ‌స్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వ‌డానికి. ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీలో అల్లుళ్ల హ‌వా బాగానే న‌డుస్తుంది. ఈ విష‌యంలో చిరంజీవి కూడా అల్లుడికే స‌పోర్ట్ గా ఉన్నాడు. ఎంతైనా మేన‌ల్లుడు క‌దా.. ఆ మాత్రం ప్రేమ ఉంటుంది. మొత్తానికి తొలి సినిమాతోనే అందాల నిధిని ప‌ట్టుకుని ఇండ‌స్ట్రీకి వ‌స్తున్నాడు వైష్ణ‌వ్. 

More Related Stories