English   

ఇద్ద‌ర‌మ్మాయిల‌తో అంటున్న సాయిధరంతేజ్.. 

Sai-dharam-tej
2018-11-06 17:03:44

వరస ఫ్లాపులతో రేస్ లో బాగా వెనకబడిపోయిన సాయిధరమ్ తేజ్ ఇప్పుడు చిత్ర‌ల‌హ‌రి సినిమాతో వ‌స్తున్నాడు. బార్ అండ్ రెస్టారెంట్ అనేది ట్యాగ్ లైన్. కిషోర్ తిరుమల తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. టైటిల్ నే ఇద్ద‌రు అమ్మాయిల క‌థ అని అర్థ‌మ‌వుతుంది. చిత్ర‌ల‌హ‌రి అంటే సాధార‌ణంగా మ‌న‌కు గుర్తొచ్చేది పాట‌ల ప్రోగ్రామ్.. కానీ ఇప్పుడు ఇదే పాపుల‌ర్ టైటిల్ తీసుకుని సినిమా చేస్తున్నాడు కిషోర్ తిరుమ‌ల‌. ఇక ఇందులో సాయితో జోడీ క‌ట‌ట్ట‌డానికి ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు ఖ‌రారు అయిపోయారు. ఇందులో ఓ హీరోయిన్ హ‌లో హీరోయిన్ క‌ళ్యాణీ ప్రియదర్శన్ న‌టిస్తుంది. సినిమా ఓపెనింగ్ డేనే ఈమె పేరు చెప్పారు.. పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొంది ఈ ముద్దుగుమ్మ‌. శ‌ర్వానంద్ సినిమాలో కూడా న‌టిస్తుంది క‌ళ్యాణి. ఇక ఇప్పుడు మ‌రో హీరోయిన్ కూడా క‌న్ఫ‌ర్మ్ అయిపోయింది. కొన్ని రోజులుగా ఎవ‌రు ఎవ‌రు అని వేచి చూస్తుండ‌గా నివేదా పేతురాజ్ కు క‌నెక్ట్ అయ్యాడు సాయిధ‌ర‌మ్ తేజ్. మెంట‌ల్ మ‌దిలో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయింది ఈ బ్యూటీ. ఇందులో త‌న న‌ట‌న‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. ఆ సినిమా త‌ర్వాత నివేదా పేతురాజ్ వైపు మ‌న ద‌ర్శ‌కులు ఎవ‌రూ చూడ‌లేదు. ఇక ఇప్పుడు మెగా మేన‌ల్లుడు ఈ బ్యూటీకి బ్రేక్ ఇవ్వడానికి సిద్ధ‌మ‌య్యాడు. మ‌రి చూడాలిక‌.. ఈ ఇద్ద‌ర‌మ్మాయిల‌తో మ‌ద్య‌లో సాయి ఎలా న‌లిగిపోనున్నాడో..? 

More Related Stories