English   

మళ్లీ మాస్ కు వచ్చిన రామ్ చరణ్ 

Ram-Charan
2018-11-06 10:19:17

లేట్ అయింది కానీ.. లేటెస్ట్ గా లేదు.. వెయిటింగ్ కు ఫుల్ స్టాప్ పడింది.. కానీ ఫుల్ శాటిస్ ఫై చేయలేదు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పై వినిపిస్తోన్న కమెంట్స్ ఇవే. అవును.. ఈ మూవీ ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ చాలాకాలంగా వెయిట్ చేస్తున్నారు. సడెన్ గా దీపావళి సందర్భంగా విడుదల చేశారు. కానీ ఇందులో ఏమంత కొత్తదనం ఉన్నట్టు కనిపించడం లేదు. సరిగ్గా ఇలాంటి లుక్ నే బోయపాటి గత సినిమా ‘జయజానకి నాయక’ కోసం విడుదల చేశాడు. అటు రామ్ చరణ్ కూడా ఇంచుమించు ఇలాంటి లుక్ తోనే ‘నాయక్’ సినిమాలోనూ కనిపిస్తాడు. అందుకే లేట్ అయినా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఏమంత లేటెస్ట్ గా లేదనే కమెంట్స్ ఓపెన్ గానే వినిపిస్తున్నాయి. కాకపోతే బోయపాటి మార్క్ ఊరమాస్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనేలా ఉందీ లుక్. 

ఇక టైటిల్ విషయానికి వస్తే.. గత కొంతకాలంగా వినిపిస్తోన్న టైటిల్ ఇదే. అంతకు ముందు గ్యాంగ్ లీడర్ లాంటి టైటిల్స్ కూడా వినిపించాయి. బట్ ఫైనల్ గా ‘వినయ విధేయ రామ’ అనే అచ్చ తెలుగు టైటిల్ తో వస్తున్నాడు బోయపాటి. ఇది టైటిల్ గా బానే ఉన్నా.. రామ్ చరణ్ సినిమాకు మాత్రం బావున్నట్టు అనిపించడం లేదు. నిజాజినికి బోయపాటి గత సినిమా ‘జయజానకి నాయక’అన్నప్పుడు కూడా అందరూ ఇలాగే పెదవి విరిచారు. కానీ కంటెంట్ చూస్తే ఈ టైటిలే కరెక్ట్ అంటారు అన్నాడప్పుడు. కొంత వరకూ నిజమే అయినా అది హండ్రెడ్ పర్సెంట్ సూట్ కాలేదు. అందుకే ఈ టైటిల్ మెగా ఫ్యాన్స్ ను పూర్తిగా శాటిస్ ఫై చేస్తుందనుకోలేం. ఇక కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ వివేక్ ఓబెరాయ్ విలన్ గా నటిస్తున్నాడు. ఆర్యన్ రాజేశ్ ఈ మూవీతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయం అవుతున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ వినయ విధేయ రాముడు సంక్రాంతి బరిలో రాబోతున్నాడు. 

More Related Stories