English   

విజయ్ దేవరకొండతో మాజీ హీరోయిన్

Vijay-Deverakonda
2018-11-06 18:02:52

విజయ్ దేవరకొండ.. లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషన్. అతి తక్కువ టైమ్ లోనే అతి పెద్ద స్టార్ గా ఎదిగిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ఏం చేసినా చూస్తారు అనేంత క్రేజ్ ఉంది. రీసెంట్ గా నోటా సినిమా డిజాస్టర్ అయినా అతని క్రేజ్ తగ్గకపోవడానికి ఇదే కారణం. ప్రస్తుతం మరో సినిమాతో సిద్ధంగా ఉన్నాడు విజయ్. రాహుల్ సాంకృత్యాయన్ డైరెక్ట్ చేసిన టాక్సీవాలా ఈ నెల 17న విడుదల కాబోతోంది. ఇది ఓ సూపర్ నేచురల్ థ్రిల్లర్ అని చెబుతున్నారు. విజయ్ టాక్సీ డ్రైవర్ గా కనిపిస్తాడు. అయితే అతని టాక్సీలోనే కొన్ని మిస్టీరియస్ థింగ్స్ జరుగుతుంటాయి. అవేంటో కనిపెట్టే ప్రయత్నం చేసే హీరోకు అనూహ్యమైన సంఘటనలు ఎదురుకావడం.. అక్కడి నుంచి ఆడియన్స్ మెస్మరైజ్ అయ్యే విషయాలు తెలియడం వంటివన్నీ ఉంటాయని టాక్. మొత్తంగా ఈ మూవీతో మరో హిట్ కొట్టాలని ప్రయత్నంలో ఉన్నాడు విజయ్.  విజయ్ దేవరకొండ సరసన ప్రియాంక ఝాల్కర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో మాజీ హీరోయిన్ కళ్యాణి కూడా ఓ కీలక పాత్రలో నటించింది. తను విజయ్ కి వదిన పాత్రలో కనిపిస్తుందట. అయితే రెగ్యులర్ వదిన పాత్రల్లాగా కాకుండా.. కాస్త వైవిధ్యంగా ఉంటుందట. కథలో ఈ పాత్రకు చాలా ఇంపార్టెంట్ ఉంటుందని చెబుతున్నారు. అయితే చాలా రోజుల తర్వాత  తనకు మంచి పాత్ర పడిందని చెబుతున్నారు. ఒకప్పుడు మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసిన కళ్యాణి పెళ్లి తర్వాతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. ఆ పాత్రలో కూడా కొంత గ్యాప్ వచ్చింది. అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ మళ్లీ గ్యాప్ వచ్చింది. మరి ఈ గ్యాప్ ను ఇకపై రాకుండా టాక్సీవాలా హెల్ప్ అవుతాడేమో చూడాలి. 

More Related Stories