English   

అనుష్క సినిమా ఒప్పుకొందట..!

Anushka Shetty Will Accept B Saroja Devi Role in NTR Biopic
2018-11-07 08:13:51

బాహుబలి, భాగమతి తర్వాత అనుష్క ఎక్కడికి వెళ్లింది. తనకు ఏమైంది. అసలు సినిమాలు చేస్తుందా లేదా అనే డౌట్స్ చాలామందిలో ఉన్నాయి. అయితే రీసెంట్ గా తను ‘సైలెన్స్’ అనే సినిమా  చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే సైలెన్స్ మాత్రమే కాదు.. తను మరోసారి బాలయ్యతో నటించేందుకు ఒకే చెప్పిందనే వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తను ఈ పాత్ర చేయడానికి కారణం హీరో కంటే ఎక్కువగా దర్శకుడు కావడం విశేషం. అవును.. మీరూ ఊహిస్తున్నది కరెక్టే.. అనుష్క ‘‘మహనాయకుడు ఎన్టీఆర్’’బయోపిక్ లో నటిస్తోంది. ఆశ్చర్యపోతున్నారు కదూ.. కానీ ఇది నిజం. అనుష్క శెట్టి మళ్లీ మేకప్ వేసుకుంటోంది. అది కూడా క్రిష్ డైరెక్షన్ లో బాలయ్య ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్ లోనే. మరి తను ఎవరి పాత్ర చేస్తోందో తెలుసా.. ?

గతంలో బ్యూటీఫుల్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకున్న బి సరోజాదేవి, ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో కొన్ని మంచి సినిమాలు వచ్చాయి. ఈ ఇద్దరిదీ హిట్ జోడీ. ఇప్పుడా బి. సరోజాదేవి పాత్రలోనే అనుష్క నటించబోతోందనే వార్తలు స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ మూవీ మరో షెడ్యూల్ స్టార్ట్ కాబోతోంది. ఆ షెడ్యూల్ లోనే అనుష్క సన్నివేశాలు చిత్రీకరిస్తారని సమాచారం. అయితే అనుష్క ఈ పాత్ర ఒప్పుకోవడానికి కారణం దర్శకుడు క్రిష్ అని వినిపిస్తోంది. క్రిష్ తో అనుష్క గతంలో వేదం సినిమా చేసింది. ఇక బాలయ్యతోనూ ఒక్కమగాడు అనే డిజాస్టర్ సినిమాలో నటించింది అనుష్క.

ఇక ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్టు ముందు నుంచీ చెబుతున్నారు. ఫస్ట్ పార్ట్ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాను జనవరి 9న విడుదల చేస్తున్నాడు. అలాగే రెండో భాగంగా వస్తోన్న ‘ఎన్టీఆర్ మహానాయకుడు’గా జనవరి 24న విడుదల చేయబోతున్నారు.

More Related Stories