English   

బాబోయ్.. లుక్కుతోనే చంపేస్తున్నారుగా..?

Kamal Haasan Unveiled Vikram’s Kadaram Kondan First Look
2018-11-07 10:09:08

ఈ పోస్టర్ లో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా..? కాస్త జాగ్రత్తగా గమనించండి.. కబీర్ అనే విలన్ లా కనిపిస్తున్నాడా..? అయితే మీరు మళ్లీ పొరబడ్డట్టే.. మీరు చూస్తోన్న ఆ పర్సన్ చియాన్ విక్రమ్. ఏంటీ షాక్ అయ్యారా..? బట్ ఇది నిజం. ఈ లుక్ లో ఉన్నది విక్రమే. మరి ఈ లుక్ ఏ సినిమాలోదో తెలుసా.. కమల్ హాసన్ సినిమాలోనిది. యస్ ఈ స్టిల్ కమల్ హాసన్ సినిమాలోనిదే.

విక్రమ్.. కోలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్ లోనూ టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్. ది బెస్ట్ యాక్టర్ గా ఎప్పుడో ప్రూవ్ చేసుకున్న విక్రమ్ కు గత పదేళ్లుగా ఓ సాలిడ్ హిట్ లేదంటే ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఇది నిజం. అతనికి సరైన హిట్ పడి దశాబ్ధం దాటింది. అయినా వరుసగా సినిమాలు చేస్తున్నాడంటే అందుకు కారణం.. ఇప్పటికీ అతని మార్కెట్ మరీ అంతగా పడిపోకవపోవడమే. ఏదేమైనా ఈ లుక్ చూశారా అతనికి సినిమాపై ఉన్న ప్యాషన్ ను తెలియజేయడం లేదూ.

కమల్ హాసన్ తర్వాత అంతటి వైవిధ్యమైన పాత్రలు చేసిన యాక్టర్ గా విక్రమ్ కు మాత్రమే పేరుంది. అలాంటి విక్రమ్ హీరోగా కమల్ హాసన్ ఓ సినిమా నిర్మిస్తున్నాడు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై రూపొందుతోన్న ఈ మూవీ రీసెంట్ గానే ప్రారంభం అయింది. చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అందుకే ఇలాంటి లుక్ ను దీపావళి కానుకగా విడుదల చేశారు. రాజేశ్ ఎమ్ సెల్వ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీకి టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. ‘కడరమ్ కొండన్’ అనేదే ఆ టైటిల్. ఈ పాత్ర కోసం విక్రమ్ ఎంతలా మారిపోయాడో చూస్తున్నారు కదా. ఇక మరో విశేషం ఏంటంటే ఈ మూవీలో విక్రమ్ సరసన కమల్ హాసన్ చిన్న కూతురు అక్షర హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కమల్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ గిబ్రన్ ఈ మూవీకీ స్వరాలు అందిస్తున్నాడు. మరి ఇద్దరు లెజెండ్స్ కలయికలో వస్తోన్న ఈ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

More Related Stories